KKR-IPL 2024: వీడియో కాల్‌ చేసి.. కోల్‌కతా ఆటగాళ్లతో ఫిల్ సాల్ట్ సంబరాలు

ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్‌లో కోల్‌కతా గెలిచిన అనంతరం ఫిల్ సాల్ట్ వీడియో కాల్ చేసి సహచర ఆటగాళ్లతో సంబరాలు చేసుకున్నాడు.

Published : 27 May 2024 20:09 IST

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో సన్‌రైజర్స్‌ని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. లీగ్‌ దశలో మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించిన కేకేఆర్‌ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) కీలకమైన ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు ముందు స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో క్వాలిఫయర్‌ 1, ఫైనల్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఫైనల్‌లో కోల్‌కతా గెలిచిన అనంతరం ఫిల్ సాల్ట్ వీడియో కాల్ చేసి సహచర ఆటగాళ్లతో సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ జట్టు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు