Hospital Signboard: ఈ సైన్‌బోర్డులో అక్షర దోషాన్ని గుర్తించగలరా?
close

Published : 24/08/2021 20:24 IST
Hospital Signboard: ఈ సైన్‌బోర్డులో అక్షర దోషాన్ని గుర్తించగలరా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: పైన ఉన్న ఫొటోలోని ఆసుపత్రి సైన్‌బోర్డులో ఏమైనా అక్షర దోషాలు ఉన్నాయేమో చదవండి.. గుర్తించారా? ఎలాంటి అక్షరదోషం లభించలేదు కదా! మళ్లీ ఒకసారి తీక్షణంగా పరీక్షించండి.. అయినా లభించలేదా అయితే సహనం కోల్పోవద్దు. చివర్లో ఉన్న ‘ఔట్‌ పేషెంట్‌ ఫార్మసీ’ కింద ఉన్న లైన్‌ చదవండి.. national impatient centre అని కనిపిస్తోంది కదా.. ఔను అందులో అక్షరదోషం ఏముంది అనుకుంటున్నారా? అక్కడ impatientకి బదులు In-patient అని ఉండాలి. అంటే ఆసుపత్రిలో చేరినవారు అని అర్థం. impatient అంటే అసహనం అని అర్థం.

బ్రిటన్‌కు చెందిన అండీ వెబ్‌స్టెర్‌ అనే ట్విటర్‌ యూజర్‌ పోస్టు చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. బ్రిటన్‌లోని లీడ్స్‌ టీచింగ్‌ ఆసుపత్రిలోని ఓ సైన్‌బోర్డును ఆయన ట్విటర్‌ ద్వారా పంచుకొని ఆ బోర్డులో అక్షర దోషాన్ని గుర్తించాలని నెటిజన్లకు సవాలు విసిరాడు. ఆ బోర్డులో ఉన్న తప్పిదాన్ని గుర్తించలేక అనేకమంది తలలు పట్టుకుంటున్నారు. దీన్ని గుర్తించాలంటే రోజుల సమయం పట్టొచ్చేమో అని సమాధానమిస్తున్న నెటిజన్ల పోస్టులు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ పోస్టు కాస్తా వైరల్‌గా మారి లీడ్స్‌ టీచింగ్‌ ఆసుపత్రి దృష్టికి వెళ్లింది. తాము చేసిన తప్పుపై ఆ ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ త్వరలోనే ఆ అక్షరదోషాన్ని సరిచేస్తామని పేర్కొంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని