Viral Video: బ్రిటన్‌లో సినీ ఫక్కీ దొంగతనం
close

Published : 19/07/2021 23:52 IST
Viral Video: బ్రిటన్‌లో సినీ ఫక్కీ దొంగతనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో సినిమాను తలపించేలా ఓ దొంగతనం చోటు చేసుకుంది. యూకే రైల్వే స్టేషన్‌లో ఓ దొంగ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారు చోరీకి పథకం రచించాడు. దొంగ కదలికలను గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. భయంతో దొంగ వారిని తోసేసి కారును పట్టాలపై నుంచి పరుగులెత్తించాడు. కొద్ది దూరం వెళ్లాక కారును వదిలేసి తప్పించుకున్నాడు. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం  సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ దొంగతనం కంప్యూటర్‌ గేమ్‌ వైస్‌ సీటీని తలదన్నేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని