‘ఆదిత్య 999’ చేస్తాను: బాలకృష్ణ
close

తాజావార్తలు

‘ఆదిత్య 999’ చేస్తాను: బాలకృష్ణ
హైదరాబాద్‌: ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ చేస్తానంటున్నారు నందమూరి బాలకృష్ణ. దిగ్గజ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా దస్పల్లా హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. ‘‘మోక్షజ్ఞను ఈ ఏడాది వెండితెరకు పరిచయం చేద్దామనుకుంటున్నా. దర్శకుడు ఎవరు అన్నది ఇంకా తెలీదు. ప్రస్తుతం నటనకు సంబంధించిన మెలకువలు నేర్చుకుంటున్నాడు. ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ చేయాలని ఉంది. నేను మోక్షజ్ఞ కలిసి ఈ సినిమా చేస్తాం. కానీ ఎప్పుడన్నది చెప్పలేను. నాకు ముందస్తు ప్రణాళికలు వేసుకుని పనిచేయడం నచ్చదు. అప్పటికప్పుడు వేడివేడిగా వడ్డించేయడమే తెలుసు. దర్శకుడిగా, నిర్మాతగానూ ప్రయత్నించాలని ఉంది. ఈ ఏడాది అదీ ప్రయత్నిస్తాను. పౌరాణిక చిత్రాలంటే ఇష్టం. ఇలాంటి సినిమాలు చేయగల దర్శకులు మనకు చాలా మంది ఉన్నారు. నేను ఎంచుకునే పౌరాణిక కథకు ఏ దర్శకుడూ న్యాయం చేయలేడు అనిపిస్తే నా సినిమాని నేనే తీసుకుంటా’’ అని అన్నారు వెండితెర శాతకర్ణి.

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.