కర్ణాటక ఎన్నికలకు రాహుల్‌ సారథ్యం
కేపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేష్‌ వెల్లడి
హైదరాబాద్‌: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సారథ్యం వహించనున్నట్లు ఆ రాష్ట్ర పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేష్‌ గుండురావు వెల్లడించారు. ఫిబ్రవరి 10 నుంచి రాహుల్‌గాంధీ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తారని, అదేనెల చివరిలో రెండో విడత, మార్చిలో మూడో విడత పర్యటనలు ఉంటాయన్నారు. ఓ కార్యక్రమంలో హాజరయ్యేందుకు నగరానికి విచ్చేసిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న శాసనసభ్యులకు ఈసారి టికెట్లు ఇవ్వబోమని సూచనప్రాయంగా తెలిపారు. జేడీ(ఎస్‌)తో జట్టు కట్టే విషయమై ప్రస్తుతానికి ఆలోచన లేదని, ఆ పార్టీ అంత ఆధారపడతగినది కూడా కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.