AP News: బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం..

తాజా వార్తలు

Published : 25/09/2021 11:27 IST

AP News: బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం..

విశాఖపట్నం: బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో గోపాల్‌పూర్‌కి 510 కి.మీ తూర్పు ఆగ్నేయ దిశలో.. కళింగపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. ఈ తుపాను గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరంలో రేపు సాయంత్రం తీరం దాటే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు పాకిస్థాన్‌ పెట్టిన ‘గులాబ్‌’ అనే పేరును ఖరారుచేసే అవకాశాలున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని