నేడు శ్రీశైలానికి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ
close

ప్రధానాంశాలు

నేడు శ్రీశైలానికి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు శుక్రవారం శ్రీశైలం రానున్నారు. ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి రహదారి మార్గంలో బయలుదేరి 8.45 గంటలకు దేవస్థానం అతిథిగృహానికి చేరుకుంటారు. అనంతరం స్వామిని దర్శించుకుంటారు. ఉదయం 10.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌ వెళ్లనున్నారు. 

సీజేఐని కలిసిన పలువురు నేతలు
సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణను గురువారం తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌ అతిథిగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేయాలి
ప్రజాసంఘాలపై నిషేధం ఎత్తివేయాలని, దీనికి సంబంధించి జీవో నం.73ను రద్దు చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు, గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణ కోరారు. ప్రజాస్వామికవాదులు, సంఘాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేసులను ఎత్తివేయాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని