ఇద్దరికి జాతీయ సేవా పథకం అవార్డులు

ప్రధానాంశాలు

ఇద్దరికి జాతీయ సేవా పథకం అవార్డులు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాములపాటి అశోక్‌రెడ్డి, దనియాల సాయిలకు జాతీయ సేవా పథకం(నేషనల్‌ సర్వీస్‌ స్కీం) 2019-20 అవార్డులు దక్కాయి. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ వీరిని అభినందించారు. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ పాములపాటి అశోక్‌రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కాలేజి ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్‌ దనియాల సాయి ఉన్నారు. గుంటూరు జిల్లా నిడమర్రుకు చెందిన అశోక్‌రెడ్డి నేతృత్వంలో ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి 5,590 మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాల ద్వారా 1,453 యూనిట్ల రక్తం సేకరించారు. ఈయన సేవలను గుర్తించి కేంద్ర యువజన వ్యవహారాలశాఖ 2019-20 సంవత్సరానికి జాతీయ సేవా పథకం అవార్డుతో పాటు రూ.1.50లక్షల నగదు బహుమతి ప్రదానం చేసి గౌరవించింది. విశాఖపట్నానికి చెందిన దనియాల సాయి.. రక్తదాన శిబిరాలు, వైద్యఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాలకు చేయూతనందించారు. సామాజిక సేవ చేసినందుకు జాతీయ అవార్డుతో పాటు, రూ.లక్ష నగదు బహుమతి అందించి సత్కరించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని