ఎవరినీ వదలం: మంత్రి కొడాలి నాని

ప్రధానాంశాలు

ఎవరినీ వదలం: మంత్రి కొడాలి నాని

ఈనాడు, అమరావతి: ‘తెదేపా పెయిడ్‌ ఆర్టిస్టులు ఇకనైనా మీడియాతో జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యమంత్రిపై అవాకులు చవాకులు పేలితే ఎవరినీ వదిలిపెట్టం’ అని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీతో కలిసి ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘పట్టాభి లాంటివారు ప్రెస్‌మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని, మమ్మల్ని తిట్టినా నేను చంద్రబాబునే తిడతా. ముఖ్యమంత్రిని తిట్టిస్తే ఆయన అభిమానులు స్పందిస్తారని చంద్రబాబు ఊహించినట్లే తెదేపా కార్యాలయంపై దాడి జరిగితే వెంటనే నాటకం మొదలుపెట్టారు. చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ కలిసే నాటకాన్ని రక్తి కట్టించారు. వారంతా ఎన్ని చేసినా సీఎం స్థాయిని తగ్గించలేరు. లోకేశ్‌ మంగళగిరిలో మొదట ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు మాట్లాడాలి’ అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని