‘రైతు వ్యతిరేకంగా కొన్ని ఆయిల్‌పామ్‌ పరిశ్రమలు’

ప్రధానాంశాలు

‘రైతు వ్యతిరేకంగా కొన్ని ఆయిల్‌పామ్‌ పరిశ్రమలు’

ఈనాడు, అమరావతి: కొన్ని ప్రైవేటు పరిశ్రమలు ఆయిల్‌పామ్‌ రైతులకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు ఇవ్వకుండా, వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ఆయిల్‌పామ్‌ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు బొబ్బా వీరరాఘవరావు అన్నారు. 18.682 ఓఈఆర్‌ అమలుపై ప్రభుత్వ ఉత్తర్వుల్ని అమలు చేయకుండా రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా వాటిని అమలు చేయడం లేదని తెలిపారు. జూన్‌, జులై నెలలకు రూ.16,320 చొప్పున ఇవ్వకుండా.. ఇష్టానుసారం చెల్లిస్తున్నారని వివరించారు. గతేడాది నవంబరు నుంచి బకాయిలు కూడా ఇవ్వడం లేదని, ఈ విషయమై వ్యవసాయ మంత్రి కన్నబాబు, ఉద్యాన కమిషనర్‌ శ్రీధర్‌కు వినతిపత్రాలు అందజేశామని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని