
ఆంధ్రప్రదేశ్
ప్రధాన కార్యదర్శిగా శివారెడ్డి
జాన్సన్బాబు, శివారెడ్డి
కర్నూలు, న్యూస్టుడే: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాఖ్య జాతీయ కార్యదర్శి జి.రంగన్న తెలిపారు. ఆదివారం కర్నూలు సీఆర్ భవన్లో ఏఐఎస్ఎఫ్ 48వ రాష్ట్ర మహాసభల మూడో రోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా జాన్సన్బాబు, ప్రధాన కార్యదర్శిగా శివారెడ్డి, ఉపాధ్యక్షులుగా నాసర్, ఓబులేసు, అప్పలస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా శ్రీరాములును ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునిస్వామి, విజేంద్ర తదితరులు పాల్గొన్నారు.