
సినిమా
హైదరాబాద్: బిగ్‌బాస్ హౌస్‌లో ‘రోల్‌ప్లే’ గేమ్‌ని ఇంటిసభ్యులందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎలిమినేషన్లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ తోటిసభ్యుల పాత్రల్లోకి పరకాయప్రవేశం చేసి నవ్వులు పూయిస్తున్నారు. ప్రియాంక పాత్రను రీక్రియేట్ చేసి కడుపుబ్బా నవ్వించిన సన్నీ.. ఇప్పుడు మరోసారి తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు. హమీద పాత్ర రీక్రియేట్ చేసి.. శ్రీరామ్ వద్దకు వెళ్లి.. ‘‘హాయ్ శ్రీరామ్ ఎలా ఉంది నీకు?’’ అని అడగ్గా.. ‘‘ప్లీజ్‌రా నీకు దండం పెడతా’’ అని శ్రీరామ్ అనడం అందర్నీ ఎంతో ఆకట్టుకుంది.
ఇక సిరి-షణ్ముఖ్‌ల మధ్య మాటల యుద్ధం మరోసారి జరిగింది. ‘‘అవతలి వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఫ్రెండ్‌కి ఇవ్వవు. నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావ్’’ అంటూ సిరిపై విరుచుకుపడిన షణ్ముఖ్ ఇప్పుడు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు ఎవరికో ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే నేను ఆపాను. నిన్ను ఎవరో అప్పడమంటే నేను ఎదురుతిరిగాను. మీ మదర్ వచ్చి అందరి ముందు హగ్ గురించి మాట్లాడారు.. ఈ మొత్తం వ్యవహారంలో నేను నెగెటివ్ అవ్వడం లేదా? వెళ్లిపో. ఇప్పటి నుంచి మిగతా ఇంటిసభ్యులు ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే’’ అని షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు, చపాతీ పిండి కలిపే సమయంలో హౌజ్‌మేట్స్ ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు.