
విశ్వసనీయతే మోహన్ రెడ్డి వ్యక్తిత్వం
పుస్తకావిష్కరణలో అమితాబ్ కాంత్
ఈనాడు, దిల్లీ: నేటి ప్రపంచంలో నమ్మకమే అన్నింటికంటే ముఖ్యమని, దాన్ని బీవీఆర్ మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సైయెంట్ వ్యవస్థాపక ఛైర్మన్ మోహన్‌రెడ్డి రాసిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా... ఫ్రమ్ డ్రీమ్స్ టు బిల్డింగ్ బిలియన్ డాలర్’ పుస్తకాన్ని ఆయన సోమవారం రాత్రి ఇక్కడ విడుదల చేసి మాట్లాడారు. ‘మోహన్‌రెడ్డి గొప్ప పారిశ్రామికవేత్త. వినూత్న ఆలోచనలు ఉన్న వ్యక్తి. అందుకే ఆయనంటే నాకు ఆరాధ్యభావం ఉంది. తన పనితీరుతో కేవలం ప్రైవేటు రంగంలోని వారినే కాకుండా ప్రభుత్వ రంగంలో ఉన్న నాలాంటి వారిలోనూ స్ఫూర్తి నింపారు. దేశంలో ఇన్నోవేషన్ సరిహద్దులను పూర్తిగా పునర్నిర్వచించిన వారిలో మోహన్ రెడ్డి కూడా ఒకరు. ఆయన ఆధ్వర్యం లోని సంస్థ ఇప్పుడు భారత్‌లో ప్రముఖ టెక్నాలజీ కంపెనీగా ఉంది. ఒక్క చిన్న వినియోగదారు కూడా ఆయన కంపెనీని వదిలిపెట్టకపోవడం ప్రపంచవ్యాప్తంగా అది అందిస్తున్న విశ్వసనీయమైన సాంకేతిక సేవలను చాటుతోంది. ఇది మోహన్‌రెడ్డి వ్యక్తిత్వానికి అద్దంపడుతుంద’ న్నారు. పుస్తక రచయిత మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకం రాయడం వెనుక ముఖ్య ఉద్దేశం దేశంలోని యువతను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడమేనన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ విధానం, మార్కెట్లోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాలవల్ల మనకు ఎక్కువ అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం గురించి చెబుతూ పుస్తకం రాసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి నెలా పది లక్షలమంది యువత ఉద్యోగాల కోసం సిద్ధమవుతోందని, సంవత్సరానికి కోటిమంది ఉద్యోగాలకోసం వేచిచూసే పరిస్థితి ఉంటోందన్నారు. పది సంవత్సరాల్లో ఈ సంఖ్య పది కోట్లకు చేరుతుందని, అంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ, ప్రైవేటురంగాలు రెండింటికీ సాధ్యం కాదన్నారు. అందువల్ల యువతే కొత్తగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే సమస్య పరిష్కారమవుతుందన్నారు.
మరిన్ని
Jio laptop: జియో ల్యాప్‌టాప్ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!
Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు.. రిలయన్స్ జియో ప్రకటన
Hero vida: మార్కెట్లోకి త్వరలో హీరో విడా ఎంట్రీ.. ఛార్జింగ్ కష్టాలకు చెక్..?
Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్!
Automobile retail sales: సెప్టెంబరు వాహన రిటైల్ విక్రయాల్లో 11% వృద్ధి


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్