CWG 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు రజతం తెచ్చిన అన్షుమాలిక్

(Photo: Anshu Malik Twitter)

బర్మింగ్‌హామ్‌: భారత రెజ్లర్‌ అన్షుమాలిక్‌ మహిళ 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో రజతం కైవసం చేసుకుంది. తుదిపోరులో నైజీరియా రెజ్లర్‌ ఒడునాయో ఫొలాసాడే అడికురో చేతిలో 4-6 తేడాతో ఓటమిపాలైంది. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమె తొలి పతకంగా రజతాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం వరుస బౌట్లలో చెలరేగి ఫైనల్‌కు చేరిన అన్షు కీలక పోరులో తడబడింది. అయితే తన పోరాటంతో అన్షు రెజ్లింగ్‌ అభిమానుల మనసులు గెలిచింది.



మరిన్ని

ap-districts
ts-districts