Tirumala: తిరుమలలో వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగ మెరిసిపోతున్న గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
 
గ‌రుడవాహ‌నం - స‌ర్వపాప ప్రాయ‌శ్చిత్తం.. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడినని తెలియజేస్తారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధ‌ర్మారెడ్డి, తితిదే అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు గరుడసేవలో పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts