Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. గ్రేటర్‌లో వాహన ప్రవాహం

హైదరాబాద్‌లో వాహన వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. 2014జూన్‌లో రోజుకు సగటున 800 కొత్త వాహనాలు రిజిస్టర్‌ అవగా గతేడాది జనవరి నుంచి సగటున 1200 రిజిస్టర్‌ అవుతున్నాయి. కరోనా ప్రభావంతో మధ్యతరగతి ప్రజలు వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలు ద్విచక్రవాహనాలు, కార్ల కొనుగోళ్లకు రుణాలిస్తుండడంతో కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. ఫలితంగా మొత్తం వాహనాల సంఖ్య ఈ ఏడాది అక్టోబరు నాటికి 75లక్షలు దాటేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నాడు-నేడు అవస్థలు చూడు

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు రెండో దశ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ పర్యవేక్షణ కొరవడటం.. పనులు చేపట్టడానికి గుత్తేదారులు ఆసక్తి చూపించకపోవడంతో ఆలస్యమవుతోంది. ప్రభుత్వం సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో సేకరించే పరికరాలు మాత్రం మందుగానే వస్తున్నాయి. ఇక్కడ జరగాల్సిన పనులు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. విలీన పాఠశాలల్లో గదుల కొరత వేధిస్తోంది. వర్షాలతో ఎక్కువ పాఠశాలలు ఉరుస్తుండటంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మూడు కూడళ్లపై రయ్యిమని సాగేలా

గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల మధ్య సాఫీ ప్రయాణానికి మార్గం సుగమమైంది. బొటానికల్‌గార్డెన్‌ కూడలి, కొత్తగూడ కూడలి, కొండాపూర్‌ కూడలి మీదుగా రాకపోకలు సులభతరం కానున్నాయి. ఆయా కూడళ్లపై నిర్మించిన పైవంతెన డిసెంబరు నెలాఖరులో అందుబాటులోకి రాబోతుంది. పనులు 95 శాతం పూర్తయ్యాయి. గచ్చిబౌలి-హఫీజ్‌పేట్‌ మధ్య తిరిగే వాహనాలకు ఈ నిర్మాణం చాలా ఉపయోగపడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బాబోయ్‌ ఇదేం కిరికిరీసర్వే..!

రెవెన్యూ రికార్డుల్లో కచ్చితత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే తప్పులతడకగా కొనసాగుతుందనే దానికి అద్దం పట్టేలా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో పలు ఉదంతాలు వెలుగులో వచ్చాయి. కొన్ని భూ వివరాలు అసలు నమోదు కాకపోవడం, అడంగల్‌లో ఉన్న విస్తీర్ణం కంటే కొందరికి తక్కువగా, మరికొందరికి ఎక్కువగా నమోదు చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇచ్చిందే తిను.. పెట్టిందే మెనూ..!

కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందించే ఆహారంలో నాణ్యతతో పాటు మెనూ పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెనూలో ఒకటి ఉంటే మరొకటి అందిస్తున్నారు. ఆసుపత్రిలో అందించే అన్నం కంటే బయట దాతల సహాయంతో అందిస్తున్న అన్నం బాగుంటుందని రోగుల బంధువులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కుట్లు వేయడానికి కాసుల కటకట!

ప్రభుత్వం ఇటీవల వైద్యుల భర్తీలో భాగంగా ఆసుపత్రికి ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ, జనరల్‌ సర్జన్‌, కంటి వైద్య, గైనిక్‌ సర్జన్లను నియమించింది. దీంతో శస్త్రచికిత్సలకు విశాఖపట్నం పంపాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక్కడే కొత్త సమస్య వచ్చి పడింది. ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో శస్త్రచికిత్సల కోసం కేటాయించిన బడ్జెట్‌ పరిమితంగా ఉంది. సర్జికల్‌ సామగ్రి ఇక్కడ ఉండటం లేదు. వీటిని బయట కొనుగోలు చేయడం భారమవుతోంది. దీంతో వైద్యులు రోగులకు శస్త్ర చికిత్సలు చేయడానికి ఆలోచించాల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మళ్లీ మోగిద్దామా నీటి గంట

మార్కులే లక్ష్యమైన విద్యా వ్యవస్థలో తీవ్రమైన జబ్బు చేసే దాకా విద్యార్థుల ఆరోగ్యస్థితిని సమీక్షించే పరిస్థితి లేదు. తల, కడుపు నొప్పి, నీరసం వంటి ప్రాథమిక లక్షణాలు  గుర్తించి.. సరిపడా నీరు తీసుకోవడంలేదని హెచ్చరిస్తున్నా అవగాహనా రాహిత్యంతో తేలిగ్గా తీసుకుంటున్నారు. మరీ ఎక్కువ జబ్బు చేస్తే.. నీళ్లు బాగా తాగించాలని వైద్యులు చెప్పే వరకు కళ్లు తెరవడంలేదు. ఈదశ దాటితే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనారోగ్యంతో వారి ఏకాగ్రత దెబ్బతిని చదువుపై ప్రభావం పడుతోంది. నివారణకు ఏకైకమార్గం నీటి గంట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 9 పోయే 6 వచ్చే..

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లా అంతా ఒకతీరు.. కొమరగిరి లేఔట్‌ది మరో తీరు. కాకినాడ నగర నియోజకవర్గానికి సంబంధించి యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లే-ఔట్‌లో 16,601 మందికి పట్టాలిచ్చారు. ఇప్పటికి ఇక్కడ  0.5 శాతం గృహాలు కూడా పూర్తి చేయలేకపోయారు. కేవలం రూ.1.80 లక్షల యూనిట్‌ విలువతో ఇళ్లు కట్టుకోలేమని చాలామంది చేతులెత్తేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పురుగుల చిక్కీ.. బూజుపట్టిన కర్జూరం: పాత నిల్వలకు కొత్త లేబుళ్లు

జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో గర్భిణులు, బాలింతలకు అందించే అదనపు పౌష్టికాహారాన్ని అక్రమార్కులు వదలడం లేదు. సంపూర్ణ పోషణ పథకం కింద పంపిణీ చేస్తున్న ‘వైఎస్‌ఆర్‌ కిట్ల’ రూపంలో ప్రతి నెలా రూ.లక్షలు దోపిడీ చేస్తున్నారు. కొందరు సీడీపీఓలు, పర్యవేక్షకులు గుత్తేదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారు. పాత సరకు (నిల్వలు)కు కొత్త లేబుళ్లు (స్టికర్లు) వేసి నయా దందాకు తెర లేపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జగనన్న కాలనీలో జలగలు

జగనన్న కాలనీలు.. అధికారులు, అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భూసేకరణ మొదలు.. మెరక చేయడం వరకు పెద్దమొత్తంలోనే దోపిడీ చేసిన కొందరు.. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలోనూ అదే రీతికి తెరదీశారు. ప్రభుత్వ ధరకే త్వరితగతిన కట్టిస్తామని చెప్పిన గుత్తేదారులు.. మధ్యలోనే వదిలేస్తున్నారు. బిల్లుల మంజూరులో అధికారులు ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు