నేడు ఓయూ 82వ స్నాతకోత్సవం

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌
ఉపకులపతి డి.రవీందర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీ 82వ స్నాతకోత్సవం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఉపకులపతి(వీసీ) ప్రొ.డి.రవీందర్‌ తెలిపారు. ఇకపై ఏటా స్నాతకోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గురువారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని, ఆయనకు న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌ అందిస్తున్నట్లు తెలిపారు. కులపతి హోదాలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సమావేశానికి అధ్యక్షత వహిస్తారన్నారు. 105 ఏళ్ల విశ్వవిద్యాలయ చరిత్రలో 47మందికి గౌరవ డాక్టరేట్లు అందించినట్లు చెప్పారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేస్తున్నట్లు వీసీ వివరించారు. గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జులై మధ్య కోర్సులు పూర్తి చేసుకున్నవారికి పట్టాలు అందిస్తున్నట్లు చెప్పారు. 31 మంది విద్యార్థులు బంగారు పతకాలు దక్కించుకోగా, వారిలో 27 మంది మహిళలే ఉన్నారన్నారు. 361 మంది పీహెచ్‌డీ పట్టాలు పొందేందుకు అర్హత సాధించారని ఇందులో అత్యధికంగా సైన్స్‌ నుంచి 76 మంది, ఆర్ట్స్‌ నుంచి 35 మంది ఉన్నారని చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని