close

వసుంధర

మెరిసిపోదాం బెనారస్‌తో!

కార్తీకం అంటేనే పవిత్రమాసం... ఈ సమయంలో జరిగే శుభకార్యాల్లో తళుక్కున మెరిసిపోవాలంటే... పట్టు కట్టాల్సిందే. కంటికింపైన రంగుల్లో రూపొందించిన ఈ బెనారసీ చీరలు కట్టుకుంటే కళ అంతా మీదే!


ఆకుపచ్చ రంగు బెనారస్‌ పట్టు చీరపై జరీ పైస్లీ మోటిఫ్‌లు జిగేల్‌మనిపిస్తుంటే... పూల అంచు కొత్తందాన్ని తెచ్చిపెట్టింది.


జరీ, మీనాకారీ పూలు... నీలం రంగు బెనారస్‌ చీర అందాన్ని రెట్టింపు చేశాయి.


రాయల్‌బ్లూ బెనారస్‌ పట్టు చీరపై వెండి రంగులో మెరిసిపోతున్న ముద్దబంతి మోటిఫ్‌లు... పైస్లీ పనితనంతో తీర్చిదిద్దిన అంచు, కొంగు ఆకట్టుకుంటున్నాయి కదూ!



వెండి రంగులో మెరిసిపోతున్న మయూరాలు... వంగపూవు రంగు చీరకు కళ తెచ్చాయి.  బంగారు, గులాబీ వర్ణాల అంచుపై పైథానీ మెరుపు ముచ్చటగొలుపుతోంది.



ఎరుపురంగు బెనారస్‌ చీరపై జరీ బుటా, దానికి జతగా పసిడి మీనాకారీ పైస్లీ పనితనం... అదరహో అనిపిస్తుంటే... అంచు, కొంగులపై అందమైన పక్షులు కనువిందు చేస్తున్నాయి.



 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు