close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇంట్లోనే జిమ్మంటూ...

వేసవిలో ఆటపాటలతో సరదాగా గడిపే పిల్లలు.. కరోనా పుణ్యమా అని గడప దాటడమే గగనం అయిపోయింది. శిక్షణ శిబిరాలూ లేకుండా పోయాయి. ఈ తరుణంలో ఇంటిపట్టునే ఉంటున్న పిల్లలకు ఆరోగ్య పాఠాలు బోధిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రతిమ కొప్పోలు. యాప్‌ ద్వారా వర్చువల్‌ వ్యాయామాలు నేర్పిస్తూ చిన్నారులకు ఆరోగ్యంతో కూడిన కాలక్షేపాన్ని అందిస్తున్నారు.

నమంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు బోలెడు. అందులో వ్యాయామం ఒకటి. హైదరాబాద్‌కు చెందిన ప్రతిమ లాక్‌డౌన్‌ వేళ పిల్లలకు వ్యాయామ తరగతులు చెబుతున్నారు. బిట్స్‌పిలానీలో చదువు పూర్తవ్వగానే.. క్యాటపుల్ట్‌ పేరుతో చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా ఓ స్టార్టప్‌ ప్రారంభించారామె. తర్వాత పెళ్లి కావడంతో అమెరికా వెళ్లిపోయారు. అక్కడే టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్‌ పూర్తిచేశారు. ఇండియాకు వచ్చాక కొన్నాళ్లకు భర్త అవినాష్‌తో కలిసి 2017లో కోకాపేటలో ఫిట్‌నెస్‌ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కావడంతో విజయవంతంగా సంస్థను నడిపారు. పిల్లలకు వ్యాయామ తరగతులు, మార్షల్‌ ఆర్ట్స్‌ వంటివి నేర్పించేవారు. పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించారు. క్రమంగా పిల్లలు రావడం తగ్గింది. దీంతో పిల్లల దగ్గరికే వెళ్లాలనే ఉద్దేశంతో ‘ఫిట్‌బి’ యాప్‌తో వర్చువల్‌ వ్యాయామ తరగతులకు శ్రీకారం చుట్టారు ప్రతిమ.

ఇంటిపట్టునే ఉండి...

ఈ యాప్‌లో 4-19 ఏళ్ల వయసున్నవారికి ఫిట్‌నెస్‌ తరగతులు చెబుతున్నారు. ‘యాప్‌లో పిల్లల పుట్టిన సంవత్సరం నమోదు చేస్తే చాలు... వాళ్లు ఏం నేర్చుకోవాలి? ఎలాంటి టాస్క్‌లు తీసుకోవాలి? వంటివన్నీ తెరపై ప్రత్యక్షమవుతాయి. ఇవన్నీ ఇంటిపట్టునే ఉండి చేయొచ్ఛు వాటిల్లో పరుగు, నడక, కిక్‌బాక్సింగ్‌, కుంగ్‌ఫూ...ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ పది నుంచి నలభై నిమిషాల నిడివితో లభ్యవుతాయ’ని చెబుతారు ప్రతిమ. లాక్‌డౌన్‌ మొదలయ్యాక చిన్నారులు ఇంట్లో బందీలైపోయారు. వారి కోసం పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు ప్రతిమ దంపతులు. పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడి పిల్లలు యాప్‌ వినియోగించేలా చేయడంలో సఫలమయ్యారు.‘ఎందరో చిన్నారులు యాప్‌ ద్వారా వ్యాయామాలు చేస్తున్నారు. మా యాప్‌ని వినియోగించే వారి సంఖ్య ఈ లాక్‌డౌన్‌ కాలంలో మూడింతలు పెరిగిందని’ చెబుతారామె.

ఇంట్లోనే ఉండి నేర్చుకోగలిగే వ్యాయామాలన్నీ యాప్‌లో ఉంటాయి. అందరికీ ఆసక్తి కలిగేలా డిజైన్‌ చేసిన బొమ్మలు, సవాళ్లు ఉత్సాహాన్నిస్తాయి. అంతేకాదు పోషకాహార ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయి’’


మరిన్ని