close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెక్‌ పెట్టేందుకు

నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చెక్‌’. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో  శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..  ‘‘నటుడిగా నితిన్‌ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్‌ చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్ర టైటిల్‌కు మంచి ఆదరణ దక్కింది. హైదరాబాద్‌లోనే షూటింగ్‌    కొనసాగుతోంది. ప్రస్తుతం నితిన్‌, రకుల్‌, సాయిచంద్‌, సంపత్‌ రాజ్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబరు 5  వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. దీంతో చిత్రీకరణ దాదాపుగా  పూర్తవుతుంది’’ అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు