close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పిల్లల కోసంపోటెత్తే శబరి దాటి..

ఉద్ధృతంగా ప్రవహించే శబరీ నది అంటే గజ ఈతగాళ్లు కూడా గజగజలాడతారు. అలాంటి నదిలో  నిత్యం ఒంటరి ప్రయాణం చేస్తోంది కమల. పోషకాహార  లేమితో సతమతమవుతున్న గిరిజన బిడ్డల కడుపునింపాలి,  వాళ్లకు చదువుసంధ్యలు నేర్పాలన్న తపనే ఆమెతో ఈ సాహసం చేయిస్తోంది.  వివరాల్లోకి వెళ్తే...

మలాసమృద్ధి అంగన్‌వాడీ కార్యకర్త. రోజూ విధులు నిర్వర్తించడం కోసం.. తన స్వస్థలమైన కొరాపుట్‌-మల్కాన్‌గిరి జిల్లాల సరిహద్దులో ఉన్న మత్తిరి గ్రామం నుంచి 17 కి.మీ. దూరంలోని లచ్చిగూడకు చేరుకుంటుంది. అయితే ఈ ప్రయాణం అంత తేలిగ్గా సాగిపోదు. అక్కడికి వెళ్లాలంటే ప్రమాదకరమైన శబరినదిని దాటాలి. నిండుగా ప్రవహించే ఈ నదిని దాటాలంటే దాని ఆనుపానులు తెలిసిన మెరికల్లాంటి పడవ నడిపేవాళ్లు కావాలి. కానీ ఎవరి సాయం తీసుకోకుండానే కమల గత ఆరేళ్లుగా నాటుపడవలో ఒంటరి ప్రయాణం చేస్తోంది. వాస్తవానికి ఆ ప్రాంతంలో అంగన్‌వాడీ కార్యకర్తలుగా పనిచేసే చాలామంది టీచర్లు ఇంత సాహసం చేయడానికి ముందుకురారు. కానీ కమల అలా కాదు... మరబోట్లు అందుబాటులో లేకపోవడంతో నాటు పడవని తీసుకుని సొంతంగా నడుపుతూ లచ్చిగూడకు వెళ్తుంది. వానొచ్చినా, వరదొచ్చినా ఆమె విధి నిర్వహణలో ఏమార్పూ ఉండదు.  ‘ఇంతటి సాహసం అవసరమా’ అని ఎవరైనా ప్రశ్నిస్తే... ‘అవసరమే. ఓ గిరిజన మహిళగా... గిరిజన బిడ్డల బాల్యం ఎంత దైన్యంగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఎంత కష్టమైనా వాళ్లకి అందాల్సిన   పోషకాహారం అందించి... నాలుగు అక్షరం ముక్కలు నేర్పించి వస్తానంటోంది’ కమల.  అంతేకాదు వయసు మీదపడిన తల్లిదండ్రులనూ పోషిస్తోంది.

- న్యూస్‌టుడే, కొరాపుట్‌, మల్కాన్‌గిరి

మరిన్ని  ఆసక్తికర కథనాలు https://epaper.eenadu.net లో..


మరిన్ని