close

తాజా వార్తలు

బాబాయ్‌ ఫోటోను షేర్‌ చేసిన అబ్బాయ్‌

హైదరాబాద్‌: దగ్గుబాటి రానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబాయ్‌ వెంకటేష్‌కు సంబంధించిన ఒక ఫొటోను షేర్‌ చేశారు. కథానాయిక ఖుష్బూతో వెంకటేష్‌ ఉన్న ఈ ఫొటో కలియుగపాండవులు సినిమాలోనిది. రానా ఈ ఫొటోను అభిమానులతో పంచుకోవడానికి ఒక కారణం ఉంది. విక్టరీ వెంకటేష్‌ సినీ ప్రస్థానం మొదలుపెట్టి నేటికి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయింది. వెంకటేష్‌ కథానాయకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన చిత్రం కలియుగ పాండవులు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో, మూవీ మొఘల్‌ రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్‌ , ఖుష్బూ జంటగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 14, 1986లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రానా ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 

ఈ సంవత్సరం ఎఫ్‌2తో మంచి విజయాన్ని అందుకున్న విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ‘వెంకీమామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. అటు రానా, సాయిపల్లవి జోడిగా విరాటపర్వం తెరకెక్కుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు