close

తాజా వార్తలు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: ఆటో రంగం కుదేలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో నిన్న భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు బుధవారం కాస్త పుంజుకొని లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9.41గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ 106 పాయింట్లు లాభపడి 37,064 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ 33 పాయింట్లు ఎగబాకి 10,959 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.92 వద్ద కొనసాగుతోంది. 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా స్టీల్‌, వేదాంత, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, యస్ బ్యాంక్‌ కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా, విప్రో, సిప్లా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రంగాలవారీగా చూస్తే.. లోహ, ఆటో, బ్యాంక్‌, ఇంధన, మౌలిక రంగాల షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఫార్మా షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు