close

క్రైమ్

బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితునికి ఉరిశిక్ష

కటక్‌(ఒడిశా), న్యూస్‌టుడే: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన కాలియా అనే నిందితుడికి ఒడిశాలోని జగత్సింగ్‌పూర్‌ అదనపు జిల్లా జడ్జి మున్నీ రాణిమిశ్ర మంగళవారం ఉరిశిక్ష విధించారు. 2018 మార్చిలో ఎరసమా ప్రాంతంలో ట్యూషన్‌ నుంచి ఒంటరిగా ఇంటికి వస్తున్న తొమ్మిదేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన కాలియా అనే యువకుడు అడ్డుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాలికను హత్యచేసి మృతదేహాన్ని గ్రామ శివారులోని జీడితోటలో పడేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు కాలియాను అరెస్టు చేశారు. మంగళవారం కేసు విచారించిన న్యాయమూర్తి.. నిందితునికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు