close

ఆంధ్రప్రదేశ్

పునరావాస పనులకు మినహాయింపు

చెల్లింపుల నిలిపివేత ఆదేశాలకు ఆర్థిక శాఖ సవరణలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ పనులు, బిల్లుల చెల్లింపుల నిలిపివేత ఉత్తర్వుల నుంచి కొన్నింటికి ఆర్థికశాఖ మినహాయింపునిచ్చింది. మునుపటి ఉత్తర్వులకు సవరణలు చేసింది. వాటిలో ముఖ్యాంశాలు...
1) పని పురోగతిని అంచనా వేసే విషయంలో సహాయ-పునరావాస చర్యలు, భూసేకరణ అంశాలను మినహాయించాలి.
2) ఈఏపీ, నాబార్డ్‌, సీఎస్‌ఎస్‌ నిధులతో చేపట్టే పనులు మినహా, ఈ ఏడాది ఏప్రిల్‌ 1కి ముందు మంజూరు చేసి, ప్రారంభించని పనులన్నీ రద్దుచేయాలి. ఈ కింది కేటగిరీల పనులకు మొదటి ఉత్తర్వుల నుంచి మినహాయింపు..
* సహాయ, పునరావాస పనులు, భూసేకరణ బిల్లులు
* ఒప్పంద విలువ రూ.10 కోట్ల కంటే తక్కువ ఉండి, నాబార్డ్‌/సీఎస్‌ఎస్‌ నిధులతో చేపట్టిన పనుల్లో ఇంత వరకు ప్రారంభం కానివి
* ఒప్పంద విలువ రూ.10 కోట్ల కంటే తక్కువ ఉండి, ఇప్పటికే ప్రారంభమైన అన్ని పనులు
ఆయా విభాగాల స్థాయిలోనే క్షుణ్నంగా సమీక్షించాక, ఆర్థిక మంత్రి ఆమోదం కోసం పంపాల్సినవి..
* ఈఏపీ కింద చేపట్టి, ఇప్పటికీ మొదలు కాని పనులు
* నాబార్డ్‌/సీఎస్‌ఎస్‌ నిధులతో చేపట్టిన వాటిలో ఒప్పంద విలువ రూ.10 కోట్ల కంటే తక్కువ ఉండి, ఇప్పటికీ మొదలు కానివి
* ఒప్పంద విలువ రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఉండి, దానిలో 25 శాతం కంటే తక్కువ ఖర్చు చేసిన, ఈఏపీ/నాబార్డ్‌/సీఎస్‌ఎస్‌ నిధులతో చేపట్టిన పనులు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు