close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఐదు నిమిషాలు చాలు..  ఒత్తిడి ఉఫ్‌

అప్పటికప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలా... ఈ చిట్కాలు పాటించి చూడండి.
* రోజులో ఐదు నిమిషాలు ధ్యానం చేయండి. కుదిరితే పొద్దుటిపూట చేయడం వల్ల మిగిలిన రోజంతా ఒత్తిడిస్థాయులు చాలామటుకూ అదుపులో ఉంటాయి.
* హాయిగా నవ్వేయండి. దీనికీ ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు. అలా నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. శరీరం విశ్రాంతి పొందుతుంది. మెదడు కూడా ఉత్సాహంగా మారుతుంది.
* పదబంధాన్ని పూర్తిచేయడం వల్ల మనసుకే కాదు, నాడీవ్యవస్థకు కూడా సాంత్వన అందుతుంది. భవిష్యత్తులో మతిమరుపు రాకుండా కూడా ఉంటుంది. ఈ పని చేయడం సరదాగా అనిపిస్తుంది కాబట్టి.. రోజూ చేస్తే మేలు.
* ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నప్పుడు చిన్న అరటిపండును తినండి. ఇందులో ఉండే పొటాషియం అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఆందోళననూ తగ్గిస్తుంది. మెదడు కూడా ప్రశాంతంగా మారుతుంది.
* ఒత్తిడిగా అనిపించిన అంశాలను ఐదునిమిషాలు సమయం పెట్టుకుని క్లుప్తంగా రాయండి. దానివల్ల ఆ ప్రభావం కొంతవరకూ తగ్గుతుందంటారు మానసిక నిపుణులు.


మరిన్ని