బ్రేకింగ్

breaking
05 May 2024 | 23:16 IST

లఖ్‌నవూను చిత్తుగా ఓడించిన కోల్‌కతా

లఖ్‌నవూ: సొంతగడ్డపై లఖ్‌నవూ చిత్తుగా ఓడింది. కోల్‌కతా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. నరైన్‌ (81) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సాల్ట్‌ (32), రమణ్‌దీప్‌ సింగ్‌ (25) చెలరేగారు. లఖ్‌నవూ బౌలర్లలో నవీనుల్‌ హక్‌ 3, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, యుధ్విర్‌ సింగ్‌ తలో వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్‌ అయింది. స్టాయినిస్‌ (36) టాప్‌ స్కోరర్‌. మిగతావారు విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3, హర్షిత్‌ రాణా 3, రస్సెల్‌ 2, స్టార్క్‌ 1, నరైన్‌ 1  వికెట్‌ తీశారు. 

మరిన్ని

తాజా వార్తలు