వ‌ర్షం కార‌ణంగా ఇంజిన్ పాడైతే బీమా వర్తిస్తుందా? - can insurers reject monsoon damaged cars
close

Updated : 18/06/2021 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ‌ర్షం కార‌ణంగా ఇంజిన్ పాడైతే బీమా వర్తిస్తుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కారు ఇంజిన్‌ దెబ్బ‌తిన్న‌ కార‌ణంతో పెద్దఎత్తున క్లెయిమ్‌లు బీమా కంపెనీల‌కు వ‌స్తుంటాయి. వర్షాకాలంలో చాలా క్లెయిమ్‌లు ప్రకృతి విప‌త్తుల వల్ల జరిగే న‌ష్టాలవే అయ్యి ఉంటాయి. సాధారణంగా నీరు లేదా హైడ్రోస్టాటిక్ లాక్ కారణంగా ఇంజిన్ దెబ్బతింటుంది. అయితే, కారు యజమానుల నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి నష్టాలు సంభవిస్తున్నాయ‌నే కార‌ణం చెప్పి బీమా సంస్థలు ఈ క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రిస్తుంటాయి.

నీటి వల్ల ఇంజిన్ దెబ్బతినడం సాధారణంగా రెండు సంద‌ర్భాల్లో జరుగుతుంది.

1. కారు నీటిలో మునిగిపోయిన‌ప్పుడు లేదా నీరు తగ్గిన తర్వాత యజమాని దాన్ని తీయ‌డానికి ప్రయత్నించిన‌ప్పుడు ఇంజిన్‌లో నీరు చేరిన కార‌ణంగా అది ప‌నిచేయ‌దు.

2. వరదలున్న ప్రాంతం నుంచి కారు వెళ్ల‌డంతో ఇంజిన్‌లోకి నీరు ప్రవేశించి దానికి నష్టం కలుగుతుంది. 

క్లెయిమ్ తిర‌స్క‌రించ‌కూడ‌దంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

మీ కారు నీటిలో మునిగిపోతే మొద‌ట బీమా కంపెనీకి పరిస్థితి వివరించండి. ఎందుకంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సంస్థ‌కు తెలియ‌జేయ‌డం ముఖ్యం. వాహనాన్ని ప‌రిశీలించ‌డం కోసం సమీప గ్యారేజీకి తీసుకెళ్లాలని బీమా సంస్థ సూచించొచ్చు. అప్పుడు కూడా ఇంజిన్ ప‌నిచేయ‌పోతే.. అది కారు య‌జ‌మాని నిర్లక్ష్యంగా కాకుండా ప్రమాదంగా పరిగణిస్తారు.

నీటితో నిండిన ప్రాంతం గుండా డ్రైవింగ్ చేసిన‌ప్పుడు ఇంజిన్ దెబ్బతింటే డ్రైవ‌ర్‌ తగిన జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తెలుసుకునే మార్గం లేనందున బీమా సంస్థ దాన్ని తిరస్కరిస్తుంది. అటువంటి సందర్భంలో కారు వరదలు ఉన్న ప్రదేశంలో ఆగిపోతే దాన్ని స్టార్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డ‌కుండా అక్క‌డే వ‌దిలేసి రావ‌డం. ఒక‌సారి నీటి మట్టం తగ్గిన తర్వాత, బీమా సంస్థకు ఫోన్ చేసి ప‌రిస్థితిని వివ‌రించి, ఏం చేయాలో అడగండి.

ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోకుండా మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు. యాడ్-ఆన్ ఇంజన్‌కు అన్ని రకాల నష్టాలపై క‌వ‌రేజ్ ఇస్తుంది. దీని ధ‌ర కూడా ఎక్కువ‌గా ఏమీ ఉండ‌దు. అయితే, ఒక‌సారి బీమా పాలసీని జారీ చేసిన తర్వాత మీరు దాన్ని కొనుగోలు చేయలేరు. పునరుద్ధరణ వరకు వేచి ఉండాలి.

నీరు క్యాబిన్‌లోకి ప్రవేశించి, స్పీకర్లు, సెన్సార్లు లేదా ఎలక్ట్రిక్ పరికరాలు వంటి భాగాలను దెబ్బతీస్తే, బీమా సంస్థ ఫ్యాక్టరీతో అమర్చిన భాగాలకు మాత్రమే చెల్లిస్తుంది. అటువంటి అమరికలను కవర్ చేసే యాడ్-ఆన్ లేకపోతే మీరు విడిగా కొనుగోలు చేసినవాటికి క‌వ‌రేజ్ ఉండ‌దు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని