బడ్జెట్‌పై బ్యాంకింగ్‌ రంగం హర్షం - Banking Sector Feels Happy on budget
close

Published : 01/02/2021 23:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌పై బ్యాంకింగ్‌ రంగం హర్షం

దిల్లీ: బడ్జెట్‌పై బ్యాంకింగ్‌ రంగం సంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థకు తాజా కేటాయింపులు ఊతమివ్వనున్నాయని పలువురు ప్రముఖ బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆరోగ్యవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక రంగం పునరుత్తేజం కానుందని పేర్కొన్నారు. 

బ్యాంకింగ్‌ రంగ పునరుద్ధరణకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకి రూ.20వేల కోట్ల మూలధనం చొప్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే, బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల సమస్య పరిష్కారానికి అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఏఆర్‌సీ)ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో నేడు బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. 

‘‘బడ్జెట్‌ 2021-22 మార్కెట్‌, సాధారణ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు దోహదం చేయనుంది. కరోనాపై పోరాటం సహా వైద్యారోగ్యంపై దృష్టి సారిస్తూ.. మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు’’- ఎస్‌.ఎస్‌.మల్లికార్జున రావు, ఎండీ, సీఈవో - పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

‘‘వైద్యారోగ్య, మౌలిక రంగానికి పెంచిన కేటాయింపులు ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నాయి. ఎంఎస్‌ఎంఈలతో పాటు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. దేశ దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని వృద్ధి కేంద్రంగా బడ్జెట్‌ను రూపొందించారు.’’- చంద్రశేఖర్‌ ఘోష్‌, ఎండీ, సీఈవో - బంధన్‌ బ్యాంక్‌

‘‘ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా కేంద్ర బడ్జెట్‌లో సాహసోపేత చర్యలు చేపట్టారు. వేగవంతమైన పునరుత్తేజానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ద్రవ్య విధానం అదుపు తప్పకుండా జాగ్రత్తగా కేటాయింపులు చేశారు’’- ఏ.కే.దాస్‌, ఎండీ, సీఈవో - బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ఇవీ చదవండి...

కేంద్ర బడ్జెట్‌ 2021-22 స్పెషల్‌

హోంశాఖకు రూ.1.66లక్షల కోట్లు..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని