close
Array ( ) 1

తాజా వార్తలు

మార్కెట్‌లోకి బీఎస్‌-6 హోండా యూనికార్న్‌

దిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన యూనికార్న్‌ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.93,593 (ఎక్స్‌షోరూం, దిల్లీ)గా నిర్ణయించింది. 160సీసీ ఇంజిన్‌తో వస్తున్న కొత్త యూనికార్న్‌ మెరుగైన పనితీరు కనబరుస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

 హోండా తొలిసారి యూనికార్న్‌ను 16 ఏళ్ల క్రితం భారత్‌లో విడుదల చేసిందని, అప్పటి నుంచి మెరుగైన పనితీరు కనబరుస్తూ ఆదరణకు నోచుకుందని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈవో, ఎండీ మినోరు కటో తెలిపారు. ఈ 16 ఏళ్లలో మొత్తం 25 లక్షల యూనిట్లను విక్రయించినట్లు పేర్కొన్నారు. కౌంటర్‌ వెయిట్‌ బ్యాలెన్సర్‌తో వస్తున్న ఈ కొత్త ఇంజిన్‌ బైక్‌ వైబ్రేషన్‌ను తగ్గింస్తుందని, వేగాన్ని క్రమంగా పెంచేటప్పుడు సున్నితమైన పనితీరు కనబరుస్తుందని కంపెనీ సీనియర్‌ర వైస్‌ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) యద్వీందర్‌సింగ్‌ గులేరియా తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.