close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/05/2020 00:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉన్నత కొలువులకు కేరాఫ్‌ అడ్రస్‌ ఎల్‌పీయూ!(ప్రకటన)

విద్యారంగంలో అగ్రగామిగా ఎదిగిన సంస్థ లవ్లీ  ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్‌పీయూ). ఇదో ప్రత్యేక విద్యాసంస్థ. బోధన, అభ్యసన, పరిశోధన, వ్యాపార, నాయకత్వ ప్రమాణాల్లో ఐఐటీలకు ఏ మాత్రం తక్కువకాదు. కొవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ యూనివర్సిటీ ఈ మధ్యే 10 లక్షల డాలర్ల నిధిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. ఈ నిధిని ఉపయోగించి ఇప్పటికే ఐఓటీ ఆధారిత ‘కవచ్‌’ను రూపొందించారు. ఎవరైనా భౌతిక దూరం ఉల్లంఘిస్తే ఇది గుర్తిస్తుంది. స్మార్ట్‌ డస్ట్‌బిన్‌ ‘అల్లీ’, కరోనా డిసిన్ఫెక్ట్‌ రాకెట్స్‌ను తయారు చేశారు. వివిధ పత్రికలు, జర్నళ్లలో వీటికి ప్రశంసలు లభించాయి.
యూనివర్సిటీలో ఇంజినీరింగే కాదు ఎంబీఏ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, డిజైన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, ఆర్కిటెక్చర్‌, లా, ఫార్మసీ ఇంకా మరెన్నో కోర్సులు అందిస్తున్నారు. ప్లేస్‌మెంట్‌ రికార్డుల్లో ఐఐటీలతో ఎల్‌పీయూను పోలుస్తారని చెప్పడంలో సందేహం లేదు. యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్లు ఎక్కువగా ఉంటాయి. 800+ ఎంఎన్‌సీలు, భారత అగ్రశ్రేణి కంపెనీలు ఎల్‌పీయూలో విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి.

ఎల్‌పీయూ 2019లో ప్లేస్‌మెంట్స్‌ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి తాన్య అరోరా రూ.42 లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్‌కు ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఒక ఫ్రెషర్‌కు ఇచ్చిన అత్యధిక వేతనం ఇదే కావడం గమనార్హం. మూడేళ్లుగా ప్లేస్‌మెంట్స్‌లో ఎల్‌పీయూ రికార్డుల పరంపర కొనసాగిస్తోంది.
తాన్య లాగే ఎల్‌పీయూ విద్యార్థులెందరో గూగుల్‌, అమెజాన్‌, బాష్‌, హెచ్‌పీ, శామ్‌సంగ్‌, ఇంటెల్‌.. ఇంకా మరెన్నో పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ మూడేళ్లలో ఏకంగా 2,226 మంది 
ఎల్‌పీయూ విద్యార్థులను ఎంపిక చేసుకోవడం ప్రత్యేకం. అత్యధిక ప్రమాణాలు పాటించడంతో 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు 2019లో ఎల్‌పీయూను సందర్శించాయి. ఇందులో హెచ్‌పీ, అడోబ్‌, జిరాక్స్‌, అబాట్‌, ఐబీఎమ్‌, కాగ్నిజెంట్‌, మైక్రోసాఫ్ట్‌ ఉన్నాయి.

తాన్య అరోరా విజయవంతమైన ప్రయాణాన్ని వీక్షించండి 


ఆరంభించినప్పటి నుంచి ప్లేస్‌మెంట్స్‌లో దూసుకుపోయేందుకు ఎల్‌పీయూ సరికొత్త బోధనా పద్ధతులను ప్రవేశపెట్టింది. విద్యారంగంలో తాజా ట్రెండ్స్‌ను అమలు చేస్తోంది. గూగుల్‌, ఎస్‌ఏపీ, సిస్కో తదితర సంస్థల భాగస్వామ్యంతో ఎల్‌పీయూలో ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీ ఇంటర్‌ఫేస్‌ ఎక్కువగా ఉంది కాబట్టి భారీ సంఖ్యలో పరిశ్రమల నిపుణులు ఇక్కడి విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటారు. ఇది విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధంగా ఉంచుతోంది.

ఎల్‌పీయూలో 3600కు పైగా ఫ్యాకల్టీ, స్టాఫ్ ఉన్నారు. ఇందులో చాలామంది ఐఐటీలు, ఎన్‌ఐటీలు, అంతర్జాతీయ వర్సిటీలైన హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ నుంచి వచ్చినవారే. ఎల్‌పీయూలో చదవడమంటే కేవలం పుస్తకాలు, తరగతి గదులకే పరిమితం కావడం కాదు. లైవ్‌ ప్రాజెక్టులు, ప్రయోగాల ద్వారా విద్యార్థులు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పద్ధతుల వల్లే ఎల్‌పీయూలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ విద్యార్థులు డ్రైవర్‌ రహిత కార్లు తయారు చేశారు. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు సొంతంగా మొబైల్‌ యాప్స్‌ రూపొందించారు. ఫ్యాషన్‌ టెక్నాలజీ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్‌ షోలు స్వయంగా నిర్వహించారు. ప్రతి తరగతి, విభాగానికి ఎల్‌పీయూలో అధునాతన ప్రయోగశాలలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద ఆడిటోరియం, ఒలింపిక్‌ రెడీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, షాపింగ్‌ మాల్‌, హాస్పిటల్‌, విద్యార్థులు నడిపించే హోటల్‌ ఉన్నాయి. రియల్‌ టైం అనుభవం పొంది విద్యార్థులు ఎదిగేందుకు ఈ వాతావరణం సృష్టించారు.

కాలం గడిచే కొద్దీ లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ దేశ, విదేశీ విద్యార్థులకు గమ్యస్థానంగా మారింది. దాదాపు 600 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ విస్తరించింది. 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, 50+ దేశాల విద్యార్థులతో ఎల్‌పీయూ పంజాబ్‌లో ఒక ‘మినీ ప్రపంచం’గా మారింది.

ఇక్కడి వైవిధ్యమైన వాతావరణంలో చదువుకున్న విద్యార్థులు అంతర్జాతీయ పౌరులుగా ఎదుగుతున్నారు. తమ ప్రతిభ, ఆసక్తుల ఆధారంగా విద్యార్థులంతా ఎల్‌పీయూలోని 150+ సాంస్కృతిక సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. నృత్యం, సంగీతం, లలిత కళలు, సాహిత్యం, రొబోటిక్స్‌, యోగా, క్రికెట్‌ సహా మరెన్నో అంతర్జాతీయ స్థాయి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొవిడ్‌-19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రవేశాల కోసం విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రవేశాల ప్రక్రియను ఎల్‌పీయూ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోకి మార్చేసింది. దరఖాస్తు నుంచి ప్రవేశం వరకు ఆన్‌లైన్‌ ద్వారా సాధ్యమవుతుంది. ఫోన్‌ లేదా ల్యాప్‌ట్యాప్‌ ద్వారా ఈ ప్రక్రియల్లో పాల్గొనొచ్చు. ఇంటి నుంచే ఎల్‌పీయూఎన్‌ఈఎస్‌టీ పరీక్షకు హాజరుకావొచ్చు. ఎల్‌పీయూలో ప్రవేశాలు త్వరలో ముగియనున్నాయి.
ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం www.lpu.in లేదా 1800 102 4057 ద్వారా సంప్రదించొచ్చు. యూనివర్సిటీ వాట్సాప్‌ నంబర్‌ 09876022222.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

Advertisement