సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ట్యాక్స్‌ సేవింగ్ ఎఫ్‌డీలు - Senior Citizens Tax Saving FDs
close

Updated : 18/09/2021 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ట్యాక్స్‌ సేవింగ్ ఎఫ్‌డీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప‌న్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, ఇవి 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పీరియ‌డ్‌తో వ‌స్తాయి. ఐటీ చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద మీ పెట్టుబ‌డుల‌పై ప‌న్ను మిన‌హాయింపును అందిస్తుంది. మీరు ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ అయితే, ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీలో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే, దేశంలోని కొన్ని ప్ర‌ముఖ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తున్న ప్ర‌స్తుత వ‌డ్డీ రేట్లు ఇక్క‌డ ఉన్నాయి. హామీ ఇచ్చే రాబ‌డుల‌ను అందించేట‌ప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు దేశంలో ప్ర‌త్యేకించి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎఫ్‌డీల‌లో పెట్టుబ‌డికి నెల‌వారీ, త్రైమాసిక, వార్షిక ప్రాతిప‌దిక‌న వ‌డ్డీ వ‌స్తుంది. ఏదేమైనా, ఆర్‌బీఐ రెపో రేటును ఒక సంవ‌త్స‌రం పాటు 4% క‌నిష్టంగా ఉంచ‌డంతో, చాలా బ్యాంకులు ఎఫ్‌డీల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి.

అలాగే పెట్టుబ‌డిదారుడి ఆదాయ‌పు ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం ఎఫ్‌డీ రాబ‌డికి పూర్తిగా ప‌న్ను విధించ‌బ‌డుతుంది కాబ‌ట్టి, వాస్త‌వ రాబ‌డి మ‌రింత త‌గ్గుతుంది. అదే ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు అయితే, 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పీరియ‌డ్‌తో వ‌చ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద మీ పెట్టుబ‌డుల‌పై ప‌న్ను మిన‌హాయింపును అందిస్తాయి. సీనియ‌ర్ సిటిజ‌న్ ఇన్వెస్ట‌ర్లు ఈ ప‌న్ను పొదుపు ఫిక్స‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డుల కోసం సంవ‌త్స‌రానికి రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డిని పెట్టి మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఇది అద్భుత‌మైన పెట్టుబ‌డి ఎంపిక‌. ఎందుకంటే చాలా బ్యాంకులు వారికి అద‌నంగా 0.5% వ‌డ్డీ రేటును అందిస్తాయి. అయితే లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి కార‌ణంగా అకాల ఉప‌సంహ‌ర‌ణ‌లు అనుమ‌తించ‌బ‌డ‌వు. ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ సింగిల్ లేదా జాయింట్ హోల్డింగ్ మోడ్‌లో ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. అయితే జాయింట్ హోల్డింగ్‌లో ప్రారంభించిన ప‌న్ను ఆదా ఎఫ్‌డీ విష‌యంలో మొద‌టి హోల్డ‌ర్ మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌ను క్లెయిమ్ చేయ‌గ‌ల‌ర‌ని గుర్తించుకోవాలి.

సాధార‌ణంగా పెట్టుబ‌డిదారుల స్లాబ్ రేటు ప్ర‌కారం ఎఫ్‌డీల రాబ‌డిపై టీడీఎస్ వ‌ర్తిస్తుంది. అయితే టీడీఎస్ నివారించ‌డానికి సీనియ‌ర్ సిటిజ‌న్లు ఫారం 15హెచ్, (సీనియ‌ర్ - సిటిజ‌న్ కాని డిపాజిట‌ర్ల‌కు ఫారం 15జీ)ని బ్యాంకుకు స‌మ‌ర్పించ‌వ‌చ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్లు నిబంధ‌న‌లు, ష‌ర‌తులు బ‌ట్టి ఐటీ చ‌ట్టం సెక్ష‌న్ 80 టీటీబీ కింద వ‌డ్డీ ఆదాయం రూ. 50,000 వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు అర్హులు. మీరు సీనియ‌ర్ సిటిజ‌న్ అయితే ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీలో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే, దేశంలోని కొన్ని ప్ర‌ముఖ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తున్న ప్ర‌స్తుత వ‌డ్డీ రేట్లు ఇక్క‌డ ఉన్నాయి. 

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు టాక్స్ సేవింగ్స్ డిపాజిట్ల‌కు వ‌చ్చే వ‌డ్డీ వివ‌రాలు ఈ క్రింది టేబుల్‌లో ఉన్నాయి.

ఈ డేటా 14 సెప్టెంబ‌ర్ 2021 నాటిది.

ఈ ప‌ట్టిక‌లో సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు (సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్‌లు మిన‌హా) 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీలు మాత్ర‌మే ఉంటాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని