Stock Market: మార్కెట్లు బే(జా)ర్‌.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌ - Sensex tumbles 1000 points
close

Updated : 28/10/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: మార్కెట్లు బే(జా)ర్‌.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం బేర్‌మంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు అక్టోబరు డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్ల అప్రమత్తతతో సూచీలు కుదేలవుతున్నాయి. బ్యాంకింగ్‌, లోహ, విద్యుత్‌, రియల్టీ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1000 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 18వేల మార్క్‌ను కోల్పోయింది.

అమ్మకాల ఒత్తిడితో ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. కాసేపటికే మరింత దిగజారాయి. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1022 పాయింట్లు పతనమై 60,120 వద్ద, నిఫ్టీ 317 పాయింట్ల నష్టంతో 17,893 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ 2శాతానికి పైగా, నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ ఒక శాతానికి పైగా నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌బ్యాంక్ షేర్లు భారీగా కుంగాయి. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని