Stock market: నష్టాల్లో సూచీలు - Stock markets are in red
close

Updated : 14/07/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 76 పాయింట్ల నష్టంతో 52,692 వద్ద.. నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 15,786 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.57 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం అప్రమత్తంగా కదలాడుతున్నాయి. అమెరికాలో బాండ్ల రాబడులు ఒక్కసారిగా పెరగడం అంతర్జాతీయ సూచీలపై ప్రభావం చూపింది. దేశీయంగా బ్యాంకింగ్‌, ఆర్థిక, స్థిరాస్తి రంగాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని