close

తాజా వార్తలు

బడ్జెట్‌ రోజున మార్కెట్లు పనిచేస్తాయ్‌

స్పష్టం చేసిన బీఎస్‌ఈ

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1న స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయని, ఆ రోజున ట్రేడింగ్‌ జరుగుతుందని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 శనివారం. సాధారణంగా శని, ఆదివారాల్లో మార్కెట్లకు సెలవు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా మార్కెట్లు సెలవు దినాల్లో పనిచేయవు. అయితే బడ్జెట్ నేపథ్యంలో ఈ సారి శనివారం కూడా ట్రేడింగ్‌ నిర్వహించనున్నట్లు బీఎస్‌ఈ ఓ సర్క్యులర్‌తో తెలిపింది. సాధారణ రోజు మాదిరిగానే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సెషన్‌ కొనసాగుతుందని వెల్లడించింది. 

ఈ సారి బడ్జెట్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అవి మార్కెట్‌పై అధిక ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ట్రేడింగ్‌ నిర్వహించాలని చాలా మంది ట్రేడర్లు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 2015లోనూ ఇలాగే బడ్జెట్‌ కారణంగా సెలవు రోజున ట్రేడింగ్‌ జరిపారు. ఆ ఏడాది ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ రోజు శనివారం అయినప్పటికీ మార్కెట్లు పనిచేశాయి. 

2001కి ముందు కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. దీంతో బడ్జెట్‌ నిర్ణయాలు మరుసటి రోజు మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రభావం చూపించేవి. అయితే ఆ తర్వాత సంప్రదాయాన్ని మార్చి ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వస్తున్నారు.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.