ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు... - full-details-about-sbi-multi-option-deposit-scheme
close

Updated : 11/03/2021 12:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ తెలుసా?

దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ వినియోగదారులకు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌ (ఎంఓడీఎస్) ను అందిస్తోంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది. అలాగే మీకు అవసరం అయినప్పుడు డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. ఇది పొదుపు లేదా కరెంట్ అకౌంట్‌తో అనుసంధానించి ఉంటుంది. ఖాతాదారులు మెచ్యూరిటీకి ముందుగానే డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అకౌంట్‌లోని డబ్బులకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ గురించి తెలుసుకోవలసిన 10 విషయాలను మీ కోసం కింద తెలియచేస్తున్నాము. 

1) ఎస్‌బీఐ ఎంఓడీఎస్ ఖాతాను తెరవడానికి అవసరమైన కనీస టర్మ్ డిపాజిట్ మొత్తం రూ. 10,000. 

2) ఎస్‌బీఐ ఎంఓడీఎస్ ఖాతాకు గరిష్ట టర్మ్ డిపాజిట్ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు.

3) ఎస్‌బీఐ ఎంఓడీఎస్ ఖాతా వడ్డీ రేటు, టర్మ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేటుకు సమానంగా ఉంటుంది. సాధారణ వినియోగదారులకు ఎస్‌బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు 2.9 శాతం నుంచి 5.4 శాతం మధ్య ఉంటాయి. ఈ రేట్లు జనవరి 8, 2021 నుంచి అమలులోకి వచ్చాయి.

4) ఎస్‌బీఐ ఎంఓడీఎస్ ఖాతాకు వర్తించే కాలపరిమితి కనిష్టంగా‌ 1 సంవత్సరం నుంచి గరిష్టంగా 5 సంవత్సరాలు.

5) ఎస్‌బీఐ ఎంఓడీఎస్ ఖాతా ముందస్తు ఉపసంహరణలను అనుమతిస్తుంది. రూ. 5 లక్షల వరకు ఎఫ్డీలకు, ముందస్తు ఉపసంహరణ జరిమానా 0.50 శాతం (అన్ని కాలపరిమితులకు) గా ఉంది. రూ. 5 లక్షల కంటే ఎక్కువ నుంచి రూ. 1 కోటి కంటే తక్కువ ఉన్న ఎఫ్డీలకు వర్తించే జరిమానా 1 శాతం (అన్ని కాలపరిమితులకు) గా ఉంది. 

6) వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా, మైనర్ ( అతను / ఆమె లేదా అతని / ఆమె సంరక్షకుడి ద్వారా), ఫిర్మ్స్, కంపెనీ, లోకల్ బాడీస్, ఏదైనా ప్రభుత్వ విభాగం ఎస్‌బీఐ ఎంఓడీ ఖాతాను తెరవవచ్చు. 

7) ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ పథకానికి టీడీఎస్ వర్తిస్తుంది.

8) ఎస్‌బీఐ ఎంఓడీ ఖాతాలో రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. 

9) ఎస్‌బీఐ ఎంఓడీ ఖాతాకు నామినేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది

10) మీరు ఆన్‌లైన్ ఎస్‌బీఐ ద్వారా లేదా మీ సమీప బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా ఎస్‌బీఐ ఎంఓడీ ఖాతాను తెరవవచ్చు. 

ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ ఎంఓడీ ఖాతాను ఎలా తెరవాలి?

1) ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లో లాగిన్ అవ్వండి.

2) ఫిక్స్డ్ డిపాజిట్ సెక్షన్ పై క్లిక్ చేయండి. 

3) అనంతరం ఈ-టీడీఆర్ / ఈ-ఎస్టీడీఆర్ (ఎఫ్డీ) పై క్లిక్ చేయండి.

4) ఇప్పుడు, ఈ-టీడీఆర్ / ఈ-ఎస్టీడీఆర్ (ఎంఓడీ) మల్టీ ఆప్షన్ డిపాజిట్ ను ఎంచుకుని ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. 

5) అనంతరం మీ డెబిట్ ఖాతా నంబర్‌ను ఎంచుకొని, ఎంఓడీ మొత్తాన్ని నమోదు చేసి, టీడీఆర్ లేదా ఎస్టీడీఆర్ వంటి డిపాజిట్ ఆప్షన్ లను ఎంచుకోండి. అనంతరం మీ ఎంఓడీ కాలపరిమితిని నమోదు చేసి సమర్పించండి.

6) మీ ఎంఓడీ ప్రారంభ అభ్యర్థనను నిర్ధారించండి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని