టెక్ నియామకాలు అదిరాయ్
కరోనా ముందు స్థాయికి: ఇండీడ్.కామ్
ఈనాడు, హైదరాబాద్: టెక్నాలజీ ఉద్యోగ నియామకాలు మళ్లీ జోరుగా సాగుతున్నాయి. వివిధ ఐటీ, ఇంజినీరింగ్ కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా పెద్దఎత్తున నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కరోనా ముందు స్థాయికి ఈ నియామకాలు చేరుకున్నట్లు ప్రపంచంలోని అతిపెద్ద జాబ్ సైట్ అయిన ఇండీడ్.కామ్ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. 2020 జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో టెక్నాలజీ ఉద్యోగ నియామకాలు 13 శాతం పెరిగినట్లు ఈ సంస్థ వెల్లడించింది. 2020 ఏప్రిల్ నెల నుంచి నియామకాలు పెరుగుతున్నాయని, గత నవంబరులో అత్యధికంగా ఉద్యోగ నియామకాలు 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఐటీ, ఐటీఈఎస్, ఆర్థిక సేవలు, ఇ-కామర్స్, కన్సల్టింగ్ రంగాల కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తేల్చింది. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ లీడ్, క్లౌడ్ ఇంజినీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఫుల్ స్టేక్ డెవలపర్.. వంటి ఉద్యోగాలకు భారీగా జీతభత్యాలు లభిస్తున్నట్లు వివరించింది.
కరోనా మహమ్మారి వల్ల ఇంటి నుంచి పనిచేయాల్సిన పరిస్థితుల్లో టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలకు గిరాకీ ఏర్పడింది. దీనికి అనుగుణంగా టెక్నాలజీ నిపుణుల అవసరాలు పెరుగుతున్నాయి. అందుకే నియామకాలు అధికం అయ్యాయని ఇండీడ్.కామ్ ఎండీ శశికుమార్ వివరించారు. డిజిటైజేషన్, వర్చువల్ కార్యకలాపాలు ఇంకా పెరుగుతాయని, అందువల్ల సమీప భవిష్యత్తులో టెక్నాలజీ ఉద్యోగాలకు అధిక డిమాండ్ లభిస్తుందని అన్నారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. సర్, నేను రూ . 1.50 కోటి బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకున్నాను. 40 ఏళ్ళ పాలసీ, ప్రీమియం రూ. 24,650. దీని బదులు ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. 10 ఏళ్లలో ఏడాదికి రూ. 54,600 కడితే చాలంటున్నారు. సలహా ఇవ్వండి.
-
Q. నా పేరు ప్రదీప్, నిజామాబాదు వాసిని. నేను మే 2017 నుంచి కోటక్ స్టాండర్డ్ మల్టీ కాప్, ఎల్ అండ్ టీ మిడ్ కాప్ ఫండ్ లో రూ. 3000 చొప్పున సిప్ చేస్తున్నాను. గత 6 నెలలుగా ఎల్ & టీ మిడ్ కాప్ ఫండ్ రాబడి తగ్గుతూ ఉంది. ఇందులో కొనసాగాలా లేదా మారమంటారా?
-
Q. నా పేరు ప్రదీప్, నిజామాబాదు నివాసిని.నా నెలసరి జీతం రూ. 40 వేలు. గత నెలలో నేను రూ. 1.5 కోటి బీమా హామీ గల ఐసీఐసీఐ టర్మ్ పాలసీ తీసుకున్నాను,ప్రీమియం రూ. 24,064. ఇది మంచిదేనా?