close

Published : 22/04/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐఫోన్‌ 12.. ఊదా రంగులో

మరిన్ని ఉత్పత్తులూ ఆవిష్కరించిన యాపిల్‌

ఏడాదిలో తొలిసారిగా యాపిల్‌ పలు ఉత్పత్తులను ఆవిష్కరించింది. అందులో ఐప్యాడ్‌ ప్రొ టాబ్లెట్లు, ఐమ్యాక్‌, యాపిల్‌ టీవీ 4కేలతో పాటు ఊదా (పర్పుల్‌) రంగులో ఐఫోన్‌ 12ను తీసుకొచ్చింది. అయితే ఈ వేరియంట్‌ భారత్‌లో లభిస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
ఎయిర్‌ట్యాగ్‌: చాలా కాలంగా దీని గురించి వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. యాపిల్‌ ఉత్పత్తులతో పాటు థర్డ్‌ పార్టీకి చెందిన ఉత్పత్తులనూ ఇది వెతికి పెడుతుంది. హ్యాండ్‌బ్యాగ్‌, బ్యాక్‌ప్యాక్‌, ఇతర వస్తువులకు దీనిని అటాచ్‌ చేసుకుని యాపిల్‌కు చెందిన ఫైండ్‌ మై యాప్‌ ద్వారా పోగొట్టుకున్న ఉత్పత్తుల లొకేషన్‌ను పట్టుకోవచ్చు. లొకేషన్‌ డేటా గోప్యంగా ఉంచుతామని  కంపెనీ స్పష్టం చేసింది. ఒకటి, నాలుగు ప్యాక్‌లలో లభించే ఎయిర్‌ట్యాగ్‌ ధరలు వరుసగా రూ.3190, రూ.10900గా ఉన్నాయి. ఇవి ఏప్రిల్‌ 30 నుంచి లభ్యమవుతాయి.
కొత్త ఐమ్యాక్‌: ఎమ్‌1 చిప్‌తో మరింత చిన్నగా, పలుచటి డిజైన్‌తో..1080పీ ఫేస్‌ టైమ్‌ హెచ్‌డీ కెమేరా, స్టూడియో క్వాలిటీ మైక్‌లు, ఆరు స్పీకర్ల సౌండ్‌ సిస్టమ్‌తో పాటు తొలిసారిగా టచ్‌ ఐడీతో వస్తోంది. 256 జీబీ, 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో మూడు వేరియంట్లలో కొత్త ఐమ్యాక్‌ లభిస్తుంది. దీని ధర ప్రారంభ ధర రూ.1,19,900.
ఐప్యాడ్‌ ప్రొ, ఐప్యాడ్‌ ప్రొ మినీ: 16 జీబీ మెమొరీ, రెండింతల వేగవంతమైన స్టోరేజీ, 2టీబీ సామర్థ్యంతో వస్తున్న 12.9 అంగుళాల ఐప్యాడ్‌ ప్రొ భారత్‌లో రూ.99,900(వైఫై వర్షన్‌); రూ.1,13,900(వైఫై, ఎల్‌టీఈ మోడల్‌)కు లభిస్తుంది. 11 అంగుళాల ఐప్యాడ్‌ ప్రొ ధరలు వరుసగా రూ.71,900(వైఫై వర్షన్‌), రూ.85,900(వైఫై, ఎల్‌టీఈ మోడల్‌)గా ఉన్నాయి.
ఐఫోన్‌ 12 ఊదా: ఈ ఫోన్‌ రూ.79,900 నుంచి ప్రారంభం కానుండగా.. ఐఫోన్‌ 12 మిని(ఊదా) రూ.69,900తో మొదలవుతోంది. మిగతా రంగులకూ ఇదే ధర వర్తిస్తుంది. యాపిల్‌ టీవీ 4కే ప్రారంభ ధర రూ.18,900 కాగా, కొత్త సిరి రిమోట్‌ రూ.5800కు లభించనుంది. యాపిల్‌ పెన్సిల్‌ రూ.10,900; మ్యాజిక్‌ కీ బోర్డు రూ.27,990(11 అంగుళాల ఐప్యాడ్‌ ప్రొ కోసం); రూ.31,900(12.9 అంగుళాల ఐప్యాడ్‌ ప్రొ కోసం)కు అందిస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని