ఐటీ షేర్లు నడిపించాయ్‌
close

Updated : 25/06/2021 04:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీ షేర్లు నడిపించాయ్‌

సమీక్ష

సూచీలకు మళ్లీ లాభాలు

ఒక రోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఇన్ఫోసిస్‌ సహా ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు కలిసొచ్చింది. రూపాయి కోలుకోవడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 74.18 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 52,514.57 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 52,830.68 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 392.92 పాయింట్ల లాభంతో 52,699 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 103.50 పాయింట్లు పెరిగి 15,790.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,702.70- 15,821.40 పాయింట్ల మధ్య కదలాడింది.

* రూ.9200 కోట్ల మెగా బైబ్యాక్‌ ప్రక్రియను ప్రారంభించనున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు దుమ్మురేపింది. ఇంట్రాడేలో 4 శాతం పెరిగిన షేరు రూ.1568.35 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.75 శాతం లాభంతో రూ.1559.15 వద్ద ముగిసింది.

* సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లలో నమోదైన తొలిరోజే అదరగొట్టాయి. ఇష్యూ ధరైన రూ.291తో పోలిస్తే బీఎస్‌ఈలో 3.91 శాతం ఎక్కువగా రూ.302.40 వద్ద షేరు నమోదైంది. చివరకు 24.69% దూసుకెళ్లి రూ.362.85 వద్ద అప్పర్‌సర్క్యూట్‌ను తాకింది.

* శ్యామ్‌ మెటాలిక్స్‌ ఇష్యూ ధర రూ.306తో పోలిస్తే బీఎస్‌ఈలో 19.93% లాభంతో రూ.367 వద్ద నమోదైంది. చివరకు 22.82% లాభంతో రూ.375.85 దగ్గర స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 లాభపడ్డాయి. టీసీఎస్‌  3.42%, టెక్‌ మహీంద్రా 2.23%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.85%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.82%, ఎల్‌ అండ్‌ టీ 1.64%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.48%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.42%, మారుతీ 1.30% మెరిశాయి. రిలయన్స్‌ 2.35%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.99%, పవర్‌గ్రిడ్‌ 0.45%, ఎస్‌బీఐ 0.43% మాత్రం డీలాపడ్డాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని