5జీ వేగంలో వొడాఫోన్‌ ఐడియా రికార్డు
close

Published : 20/09/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

5జీ వేగంలో వొడాఫోన్‌ ఐడియా రికార్డు

దిల్లీ: పుణెలో జరిగిన 5జీ ట్రయల్స్‌లో గరిష్ఠంగా  3.7 గిగాబైట్‌ పర్‌ సెకన్‌ (జీబీపీఎస్‌) వేగాన్ని నమోదు చేసినట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. భారత్‌లో ఇదే అత్యధిక వేగమని పేర్కొంది. గాంధీనగర్‌, పుణెలో మధ్య శ్రేణి స్పెక్ట్రమ్‌లో 1.5 జీబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ వేగాన్ని సాధించినట్లు వెల్లడించింది. వొడాఫోన్‌ ఐడియా 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ కోసం అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ అయిన 26 గిగాహెర్ట్జ్‌తో పాటు సంప్రదాయ 3.5 గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌ను టెలికమ్యూనికేషన్ల విభాగం (డాట్‌) కేటాయించింది. మేలో జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లకు, తర్వాత ఎంటీఎన్‌ఎల్‌ 5జీ ట్రయల్స్‌కు డాట్‌ ఆమోదం తెలిపింది. టెలికాం గేర్‌ సంస్థలు ఎరిక్‌సన్‌, నోకియా, శామ్‌సంగ్‌, సీ-డాట్‌లతో కలిసి ఆరు నెలల పాటు ట్రయల్స్‌ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని