Credit Card: స్కోరు తక్కువున్నా క్రెడిట్‌ కార్డు - you will get credit card though you dont have required score
close

Updated : 27/06/2021 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Credit Card: స్కోరు తక్కువున్నా క్రెడిట్‌ కార్డు

స్టెప్‌ అప్‌ కార్డును ఆవిష్కరించిన పైసాబజార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో రుణాల దరఖాస్తు, క్రెడిట్‌ స్కోరును తెలుసుకునే సేవలను అందించే పైసాబజార్‌.కామ్‌ కొత్తగా ఏర్పాటైన ఎస్‌బీఎమ్‌ బ్యాంక్‌ ఇండియాతో కలిసి స్టెప్‌ అప్‌ క్రెడిట్‌ కార్డును ఆవిష్కరించింది. క్రెడిట్‌ స్కోరు సరిగా లేకపోవడం వల్ల రుణాలు, క్రెడిట్‌ కార్డులు రాని వారికి అర్హతను పెంచేందుకు ఈ కార్డును ఆవిష్కరించినట్లు తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ హామీగా ఈ స్టెప్‌ కార్డును అందిస్తుంది. ఈ కార్డును బాధ్యతతో వినియోగించిన వారికి క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకు తోడ్పడుతుంది. పూర్తిగా డిజిటల్‌లోనే ఈ కార్డును పైసాబజార్‌ ప్లాట్‌ఫాంపై పొందే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉండటం వల్ల సాధారణ రుణాలను, క్రెడిట్‌ కార్డులను పొందడం కష్టంగా ఉన్న వారికి ఈ కార్డు వల్ల ప్రయోజనం లభిస్తుందని పైసాబజార్‌.కామ్‌ సీఈఓ నవీన్‌ కుక్రేజా తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని