Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009109
            [news_title_telugu_html] => 

రారండోయ్‌.. రాయితీలిస్తున్నాం..

[news_title_telugu] => రారండోయ్‌.. రాయితీలిస్తున్నాం.. [news_title_english] => [news_short_description] => అమ్మకాలు తగ్గి, కార్ల నిల్వలు పేరుకు పోతున్నందున, వినియోగదార్లను ఆకర్షించేందుకు వాహన కంపెనీలు భారీగా రాయితీలు ప్రకటిస్తున్నాయి. డీలర్లు కూడా తమ వంతుగా మరికొంత మేర రాయితీ, ఇతర ప్రయోజనాలు కల్పిస్తూ అమ్మకాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయిదేళ్ల వారెంటీ, ‘యాక్సెసరీస్‌’పై రాయితీలు సర్వీస్‌ ఛార్జీల్లో తగ్గింపు.. వంటి ఆకర్షణలు వాహన విక్రయశాలల వద్ద కనిపిస్తున్నాయి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,1, ) )
రారండోయ్‌.. రాయితీలిస్తున్నాం.. - EENADU
close
రారండోయ్‌.. రాయితీలిస్తున్నాం..

కొనుగోలుదార్ల ఆకర్షణలో వాహన కంపెనీలు, డీలర్లు
నిల్వలు వదిలించుకునే యత్నాలు
బీఎస్‌ 6 మోడళ్లకూ ఆఫర్లు!
మాంద్యం ముంగిట్లో..
ఈనాడు - హైదరాబాద్‌

మ్మకాలు తగ్గి, కార్ల నిల్వలు పేరుకు పోతున్నందున, వినియోగదార్లను ఆకర్షించేందుకు వాహన కంపెనీలు భారీగా రాయితీలు ప్రకటిస్తున్నాయి. డీలర్లు కూడా తమ వంతుగా మరికొంత మేర రాయితీ, ఇతర ప్రయోజనాలు కల్పిస్తూ అమ్మకాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయిదేళ్ల వారెంటీ, ‘యాక్సెసరీస్‌’పై రాయితీలు సర్వీస్‌ ఛార్జీల్లో తగ్గింపు.. వంటి ఆకర్షణలు వాహన విక్రయశాలల వద్ద కనిపిస్తున్నాయి.

దేశంలో ఆర్థిక మందగమనం వాహన రంగాన్ని అధికంగా కలవర పెడుతోంది. లారీలు, బస్సుల వంటి వాణిజ్య వాహనాలతో పాటు కార్ల అమ్మకాలూ వరుసగా 10 నెలల పాటు క్షీణించడంతో, ఉత్పత్తి తగ్గించుకునే పనిలో వాహన కంపెనీలు నిమగ్నమయ్యాయి. క్యాబ్‌ల వల్లే కార్లు కొనటంలేదన్న వాదనను, జీఎస్‌టీ తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందన్న అభ్యర్థలను మారుతీ సుజుకీ, బజాజ్‌ వంటి సంస్థలు సమర్థించడంలేదు. ఆర్థిక పరిస్థితుల వల్లే కొనుగోళ్లకు ప్రజలు ముందుకు రావడంలేదని విశ్వసిస్తున్నాయి.  ఆగస్టులో మూడొంతుల మేరకు ఉత్పత్తి తగ్గించిన మారుతీ సుజుకీ సంస్థ, ఈ నెలలోనూ అదే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. టయోటా కిర్లోస్కర్‌, హ్యుందాయ్‌ మోటార్స్‌ దేశీయ ప్లాంట్లలోనూ పరిస్థితులను బట్టి ఉత్పత్తి కోత అమలు చేస్తున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ ఏడాది ఆగస్టులో మారుతీ సుజుకీ విక్రయాలు 36 శాతం, హ్యుందాయ్‌ అమ్మకాలు 16 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 31 శాతం పతనమయ్యాయి. టాటా మోటార్స్‌, హోండా కార్స్‌, నిస్సాన్‌ మోటార్‌, ఫియట్‌ ఇండియా అమ్మకాలు సగానికి సగం తగ్గిపోవడం గమనార్హం.

పండుగల సీజన్‌పైనే ఆశలు

సరా-దీపావళి పండుగల సీజన్‌ అయిన సెప్టెంబరు- అక్టోబరు నెలల్లో వాహనాల అమ్మకాలు అధికంగా నమోదవుతాయి. ఈసారీ అదేవిధంగా జరిగి, కొంతమేరకు కోలుకుంటామనే ఆశాభావంతో పరిశ్రమ వర్గాలున్నాయి. ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే కృతనిశ్చయంతో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టటంతో పాటు భారీగా రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ‘షోరూమ్‌కు వచ్చిన కొనుగోలుదారు చేజారకుండా చూసేందుకు, కారు విలువను బట్టి రూ.1 లక్షకు పైగా రాయితీ ఇచ్చేందుకూ సిద్ధపడుతున్నాం. నగదు ‘రోటేషన్‌’ కావాలి కదా’ అని మూడు కంపెనీల డీలర్‌షిప్‌లను నిర్వహిస్తున్న స్థానిక అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ డీలర్‌ ఒకరు ‘ఈనాడు’కు వివరించారు. అమ్మకాలు తగ్గి, ఆదాయాలు క్షీణించడంతో షోరూమ్‌ల నిర్వహణ కష్టంగా మారినట్లు ఆయన పేర్కొన్నారు. పెద్దఎత్తున రాయితీ ఇస్తున్నా, ఆశించిన స్థాయిలో కొనుగోలుదార్లు రావటం లేదని మరొక డీలర్‌ వివరించారు. కంపెనీ, మోడల్‌ను బట్టి ఒక్కో కారుపై రూ.20,000- లక్ష వరకు రాయితీ లభిస్తోంది. కొన్ని ఖరీదైన మోడళ్లపై ఇంకా ఎక్కువ డిస్కౌంట్లూ అమల్లో ఉన్నాయి. ఉచిత బీమా, మార్పిడి బోనస్‌, అయిదేళ్ల ‘రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌’ వంటి ఆకర్షణలను డీలర్లు జోడిస్తున్నారు. బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాల ప్రకారం తీర్చిదిద్దిన వాహనాలను ఇప్పటికే కొన్ని కంపెనీలు మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ వాహనాలపైనా రాయితీ ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయంటే, వాటిపై ఎంత ఒత్తిడి ఉన్నదీ స్పష్టమవుతోంది.

కొత్త మోడళ్లకు ఆదరణ

వైపు అమ్మకాలు తగ్గుతున్నా, కొత్త మోడళ్లకు ఆదరణ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు నెలకొల్పి ఉత్పత్తి ప్రారంభించిన కొరియా కంపెనీ కియా ప్రవేశపెట్టిన ‘సెల్టోస్‌’ కార్లు ఈ నెలలో 6,200 విక్రయమయ్యాయి. ఈ కారు కొనేందుకు ఇప్పటికే 32,000 మంది ముందుకు వచ్చినట్లు కంపెనీ చెబుతోంది. చైనా యాజమాన్యం చేతిలో ఉన్న బ్రిటీష్‌ బ్రాండ్‌ ఎంజీ మోటార్స్‌ విడుదల చేసిన ‘ఎంజీ హెక్టర్‌’ వాహనాల బుకింగ్‌లు 28,000కు చేరాయని, గత నెలలో 2,000కు పైగా విక్రయించినట్లు తెలుస్తోంది. రెనో ఇండియా తాజాగా ‘ట్రైబర్‌’ మోడల్‌ తీసుకువచ్చింది. రూ.5 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ వాహనం ద్వారా అమ్మకాలు పెంచుకునే అవకాశం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. నవీకరించిన ‘సిటీ’ మోడల్‌ను హోండా కార్స్‌ త్వరలో తేనుంది. టాటా మోటార్స్‌ నుంచి ‘అప్‌గ్రేడెడ్‌’ మోడళ్లు రానున్నాయి. నిస్సాన్‌ తన నూతన ఎస్‌యూవీ ‘నిస్సాన్‌ కిక్స్‌’ అమ్మకాలు పెంచుకునే లక్ష్యంతో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో డీజిల్‌ మోడల్‌ తీసుకువచ్చింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.