ఒడిశా: టీకా కొరతతో 900 కేంద్రాలు మూత! - 900 vaccination sites in odisha shut due to vaccine shortage
close
Published : 12/04/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒడిశా: టీకా కొరతతో 900 కేంద్రాలు మూత!

కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ

భువనేశ్వర్‌: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఊపందుకున్న వేళ.. పలు రాష్ట్రాలను టీకా కొరత వేధిస్తోంది. ఈ విషయమై వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. టీకాలు సమయానికి అందుబాటులోకి రాకుంటే నిర్దేశించిన టీకా కేంద్రాలు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలో ఇప్పటికే దాదాపు 900కేంద్రాలు మూసివేసినట్లు బీజేడీ ప్రభుత్వం వెల్లడించింది. ఆయా రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేయడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని విమర్శించింది.

‘ఒడిశాలో 1400 టీకా పంపిణీ కేంద్రాలు ఉండగా వీటిలో ప్రస్తుతం 579 కేంద్రాల్లోనే టీకా పంపిణీ జరుగుతోంది. సోమవారానికి టీకా సరఫరా కాకపోతే మరికొన్ని కేంద్రాల్లో టీకా పంపిణీ నిలిచిపోతుంది’ అని ఒడిశా కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ బిజయ్‌ పాణిగ్రాహి వెల్లడించారు. భారీ స్థాయిలో టీకా పంపిణీ చేయాలని తలపెట్టిన  ‘టీకా ఉత్సవ్‌’ కార్యక్రమానికి తాజా పరిస్థితి తీవ్ర అడ్డంకిగా మారిందని అన్నారు. ఇక కొవిడ్‌ టీకా పంపిణీలో కేంద్ర ప్రభుత్వం రాజధర్మాన్ని పాటించడం లేదని.. కేవలం భాజపా పాలిత రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఒడిశా కార్మికశాఖ మంత్రి సుశాంత్‌ సింగ్‌ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో ఒడిశాపై మరింత వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 42లక్షల కరోనా డోసులు అందగా, వీటిలో ఇప్పటికే 40లక్షల డోసులను అందించామని పేర్కొన్నారు. అయితే, టీకా సరఫరాపై ఒడిశా మంత్రులు చేసిన వ్యాఖ్యలను భాజపా తప్పుబట్టింది.

కేవలం ఒడిశానే కాకుండా, మహారాష్ట్ర, పంజాబ్‌, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు టీకా కొరతపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. విదేశాలకు టీకా సరఫరాను తగ్గించి దేశీయంగా విస్తృతంగా అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సమయంలో దేశంలో టీకా కొరత లేదని కేంద్రమంత్రులు పేర్కొంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని