పవన్‌కు పోటీగా ఆ హీరో ఫిక్స్‌! - Ayyapanum Koshiyum Telugu Remake starts on decemeber 21st
close
Updated : 21/12/2020 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కు పోటీగా ఆ హీరో ఫిక్స్‌!

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ తన సినిమాల వేగాన్ని పెంచారు. ఇప్పటికే ఆయన నాలుగు చిత్రాలను ఒప్పుకొన్నారు. ఇందులో ‘వకీల్‌సాబ్‌’ దాదాపు పూర్తిగా కాగా, త్వరలోనే మరో చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్‌కల్యాణ్‌కు పోటీగా ఎవరు నటిస్తారన్న దానిపై అనే ఊహాగానాలు వెలువడ్డాయి. కన్నడ నటుడు సుదీప్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతితో పాటు యువ నటుడు రానా పేరు కూడా వినిపించింది. ఇప్పుడు ఆ పాత్ర కోసం రానాను ఖరారు చేశారు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో బిజు మేనన్‌, పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రల్లో పవన్‌, రానా కనిపించనున్నారు. కథానాయికల పాత్రలు కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సాగర్‌ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.

ఇవీ చదవండి..

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని