13ఏళ్లకు ‘బొమ్మరిల్లు’ హిందీ రీమేక్‌ విడుదల - Hindi remake of Bommarillu Its My Life Produced by boney kapoor will release on November 29th
close
Published : 06/11/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

13ఏళ్లకు ‘బొమ్మరిల్లు’ హిందీ రీమేక్‌ విడుదల

హైదరాబాద్‌: తల్లిదండ్రులు తమ పిల్లల్ని అతి జాగ్రత్తతో చూడటం వల్ల వారు పడే మనోవేదనను గుండెలకు హత్తుకునేలా చూపించిన చిత్రం ‘బొమ్మరిల్లు’. సిద్ధుగా సిద్ధార్థ్‌, హాసినిగా జెనీలియా, సిద్ధు తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ల నటన మెప్పించింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం హిందీలోనూ రీమేక్‌ అయింది.

బోనీకపూర్‌ నిర్మాతగా అన్నీస్‌ బజ్మి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. హర్మన్‌ బవేజా, జెనీలియా జంటగా నటించారు. తండ్రి పాత్రలో నానా పటేకర్‌ నటించారు. 2007లో తెరకెక్కిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఇది విడుదలకు నోచుకోలేదు. అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకురానుంది. నవంబరు 29న జీ సినిమాలో నేరుగా దీన్ని ప్రసారం చేయనున్నట్లు నిర్మాత బోనీకపూర్‌ వెల్లడించారు. దాదాపు పదమూడేళ్ల పాటు ఈ సినిమా విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం. మరి ఇన్నేళ్ల తర్వాత ఇది బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా? చూడాలంటే నెలాఖరు వరకూ వేచి చూడాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని