నయన్‌ వర్సెస్‌ సామ్‌ రూమర్స్‌కు చెక్‌! - Kaathuvaakula Rendu Kadhal Shoots Starts
close
Published : 10/12/2020 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నయన్‌ వర్సెస్‌ సామ్‌ రూమర్స్‌కు చెక్‌!

షూటింగ్‌ షురూ

హైదరాబాద్‌: అగ్రకథానాయికలు నయనతార-సమంత కలిసి నటిస్తే చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు సంతోషాన్ని అందిస్తూ ఈ ఏడాది ఆరంభంలో ‘కాతువక్కుల రెండు కాదల్‌’ అనే తమిళ సినిమా ప్రకటన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించిన కొన్నిరోజులకే సామ్‌.. దీని నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. సదరు వార్తలపై చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు. ఇటీవల లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్స్‌ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో సైతం.. సామ్‌, నయన్‌ కలిసి నటించడం లేదంటూ.. వ్యక్తిగత కారణాల వల్ల సమంత ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని మరోసారి ఊహాగానాలు వినిపించాయి.

కాగా, తాజాగా ‘కాతువక్కుల రెండు కాదల్‌’ సినిమా షూటింగ్‌ గురువారం ప్రారంభమయ్యింది. పూజా కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్‌ను చిత్రంలో నటిస్తున్న నటీనటులను ట్యాగ్‌ చేసింది. అలా ట్యాగ్‌ చేసిన వాటిల్లో నయన్‌ పేరుతోపాటు సమంత పేరూ ఉంది. దీంతో సామ్‌,నయన్‌ సినిమాపై వస్తున్న వార్తలు పుకార్లే అని తేలింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని