‘నేనొక్కడినే’ హీరోయిన్‌కు కరోనా నెగెటివ్‌ - Kriti Sanon tests negative for coronavirus thanks fans for wishes
close
Published : 19/12/2020 23:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నేనొక్కడినే’ హీరోయిన్‌కు కరోనా నెగెటివ్‌

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కృతీసనన్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈకష్ట సమయంలో తనకు అండగా ఉన్న వాళ్లందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పింది. కొంతకాలం క్రితం ఆమె రాజ్‌కుమార్‌రావ్‌తో కలిసి ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంది. డిసెంబర్‌ 9న చిత్రీకరణ ముగించుకొని చండీగఢ్‌ నుంచి ముంబయి వస్తున్న క్రమంలో ఆమెకు కరోనా సోకింది. ఆ తర్వాత చికిత్స తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు క్వారంటైన్‌లో గడిపింది. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో త్వరగానే కోలుకుంది. కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదని ఆమె అభిమానులకు సూచించింది.

‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేశ్‌బాబు సరసన నటించిన కృతీసనన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘దోచెయ్‌’లో నాగచైతన్యకు జోడీగా కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైంది. ఆమె తన తర్వాతి సినిమాలో భాగంగా లక్ష్మణ్‌ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మిమి’లో కనిపించనుంది. ఈ చిత్రంలో తన గర్భాన్ని అద్దెకు ఇచ్చే సరోగసి తల్లి పాత్రలో కృతి కనిపించనుంది. దీంతో పాటు అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా రానున్న ‘బచ్చన్‌ పాండే’ సినిమాకూ పచ్చజెండా ఊపింది.

ఇదీ చదవండి..

సోదరుడికి కరోనా.. ఎంతో భయపడ్డా : రామ్‌ మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని