‘లక్ష్మీబాంబ్‌’ ట్రైలర్‌ అదిరిపోయింది! - Laxmmi Bomb official trailer released
close
Published : 09/10/2020 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లక్ష్మీబాంబ్‌’ ట్రైలర్‌ అదిరిపోయింది!

అక్షయ్‌ నటనకు ఫిదా కావాల్సిందే..!

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన అద్భుతమైన నటనతో అందర్నీ ఫిదా చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘లక్ష్మీబాంబ్‌’. దక్షిణాదిలో తీసిన ‘ముని 2: కాంచన’కు హిందీ రీమేక్‌ ఇది. రాఘవా లారెన్స్‌ దర్శకత్వం వహించారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఓటీటీ వేదికగా నవంబరు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన ట్రైలర్‌ వీక్షకుల్ని అలరిస్తోంది. అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న అక్షయ్‌.. మహిళ పాత్రలో నటించడం విశేషం.

‘దెయ్యాలు, భూతాలనేవి లేవు..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘నిజంగా నేను దెయ్యాన్ని చూసిన రోజు.. నా చేతికి గాజులు వేసుకుంటా..’ అని అక్షయ్‌ కోపంతో అన్నారు. ఆయన షాపింగ్‌ మాల్‌లో ఎరుపు రంగు చీర కట్టుకుని మాట్లాడే తీరు హైలెట్‌గా నిలిచింది. ‘చెప్పండి.. నేనెలా ఉన్నాను.. బావున్నాను కదా.. నన్ను వదులు.. నన్ను ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం..’ అంటూ అద్భుతంగా నటించారు. ఇందులో అక్షయ్‌, కియారాకు వివాహం జరుగుతుంది. దాన్ని బట్టి ‘కాంచన’ కథలో స్వల్ప మార్పులు చేసి.. ‘లక్ష్మీబాంబ్‌’ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని