సరిహద్దులో రాత్రిపూట పాక్‌ డ్రోన్ల కలకలం! - Pak Flies Drones Across LoC At Night Says JK Police
close
Published : 23/09/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరిహద్దులో రాత్రిపూట పాక్‌ డ్రోన్ల కలకలం!

ఏకే 47లు కిందకు జారవిడుస్తున్న వైనం
జైషే మహ్మద్‌ కుట్రేనంటున్న పోలీసులు

దిల్లీ: భారత సరిహద్దులో పాకిస్థాన్‌ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశ డ్రోన్లు రాత్రి పూట నియంత్రణ రేఖ వెంబడి చక్కర్లు కొడుతున్నాయని, ఉగ్రవాదుల కోసం ఏకే 47 తుపాకులను కిందకు జారవిడుస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. తాజాగా అఖ్నూర్‌లోని ఓ గ్రామంలో దాడులకు వినియోగించే రైఫిల్స్‌, ఒక పిస్తోల్‌ గుర్తించినట్టు తెలిపారు. పాక్‌కు చెందిన డ్రోన్లు రాత్రిపూట ఓ గ్రామంలో ఆయుధాలు జారవిడుస్తున్నట్టుగా అందిన నిర్ధిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా జాద్‌ సొహాల్‌ గ్రామం నుంచి రెండు ఏకే రైఫిల్స్‌, ఒక పిస్తోల్‌, మూడు ఏకే మ్యాగజైన్లు, 90 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. భారత సరిహద్దుకు 12కి.మీల దూరంలో ఉన్న అఖ్నూరులో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఆయుధాలను కశ్మీర్‌ లోయలో ఉన్న ఉగ్రవాదులకు అందిస్తున్నట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తమ ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దీని వెనుక జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు సీనియర్‌ అధికారి శ్రీధర్‌ పాటిల్‌ తెలిపారు. 

గతేడాది కూడా పంజాబ్‌ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. అప్పట్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పంజాబ్‌ పోలీసులు కూడా గతేడాది అక్టోబర్‌లో డ్రోన్లు ఏకే 47 రైఫిల్స్, గ్రనేడ్‌లు, శాటిలైట్‌ ఫోన్లు జారవిడుస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని