ఆ ఆదాయాన్ని రైతులకు కేటాయించాలి: పవన్‌ - Pawan kalyan Deeksha
close
Published : 08/12/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఆదాయాన్ని రైతులకు కేటాయించాలి: పవన్‌

హైదరాబాద్‌: ఏపీలో నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. బాధిత రైతుకు కనీసం రూ.35 వేల నష్టపరిహారం, తక్షణసాయం కింద రూ.10వేలు ఇవ్వాలని కోరారు. నష్టపరిహారం ఇస్తేనే రైతులు కాస్త ఊపిరి తీసుకుంటారన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని తన నివాసంలో పవన్‌ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. నష్టపరిహారంపై నిర్ణయం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి 48గంటల సమయం ఇచ్చినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలకు జనసేన పిలుపునిచ్చిందన్నారు. తుపాను కారణంగా దాదాపు 17లక్షల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇది ఊహించని నష్టమని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి రైతులోనూ ఆవేదన కనిపించిందన్నారు. ఇప్పటికే కరోనాతో చితికిపోయామని.. ఈ ఏడాది వరుసగా మూడు ప్రకృతి విపత్తులు సంభవించడంతో చేతికొచ్చే దశలోని పంటలు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని పవన్‌ పేర్కొన్నారు. 

ఎకరానికి పంట పెట్టుబడిగా రూ.50వేలు అవసరమని.. కనీసం నష్టపరిహారంగా రూ.35వేలు ఇస్తే ఊపిరి పీల్చుకోగలమని రైతులు తెలిపారని పవన్‌ అన్నారు. ఇప్పటి వరకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అవసరం లేదని, ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారని పవన్‌ గుర్తు చేశారు. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రంలో సుమారు రూ.16,500కోట్ల ఆదాయం వస్తోందని.. ఆ ఆదాయాన్ని పంట నష్టపోయిన రైతులకు కేటాయించాలని జనసేనాని డిమాండ్‌ చేశారు. 

ఇవీ చదవండి..
అన్నదాతలను ఆదుకోవాలంటూ పవన్ దీక్ష

ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేస్తా: పవన్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని